బావకి బన్నీ నేర్పిన పాఠం ఏంటంటే

Thu May 05 2016 10:55:19 GMT+0530 (IST)

Ram Charan Learn From Allu Arjun

సరైనోడు సూపర్ డూపర్ సక్సెస్ సాధించింది. నెగిటివ్ టాక్ నుంచి మొదలై బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోయింది. ఊరమాస్ అంటూ అల్లు అర్జున్ చేసిన రచ్చ.. ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. తొలిసారిగా పక్కా మాస్ మూవీ చేసిన బన్నీ.. ఊహించని రేంజ్ లో విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు బన్నీ చేసిన సరైనోడుతో.. బావ రామ్ చరణ్ కు ఓ క్లారిటీ వచ్చి ఉండాలి.రామ్ చరణ్ కు బాగా పట్టున్న ఏరియా మాస్. గత కొంత కాలంగా ఆ జోనర్ ని కాకుండా వేరే సినిమాలు ట్రై చేస్తూ దెబ్బలు తింటున్నాడు. నాయక్ - ఎవడు చిత్రాలు.. పోటీ పడి మరీ పెద్ద హిట్లు కొట్టాయాంటే.. దానికి కారణం మాస్ లో రామ్ చరణ్ కి ఉన్న బలం. దీంతోపాటు క్లాస్ లోనూ పట్టుపెంచుకోవడం కోసం గోవిందుడు అందరివాడేలే - బ్రూస్ లీ లాంటి సినిమాలు చేశాడు చెర్రీ. కానీ ఇవి నిరుత్సాహపరిచాయి.

మరోవైపు అల్లు అర్జున్ మాత్రం రేసుగుర్రం - సన్నాఫ్ సత్యమూర్తి - రుద్రమదేవి - సరైనోడు సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు. మెగా ఫ్యామిలీ హీరోల్లో మిస్టర్ డిపెండబుల్ అయిపోయాడు బన్నీ. సక్సెస్ విషయంలో భరోసా ఉండడంతో.. డిమాండ్ కూడా అంతకంతకూ పెరుగుతోంది. ఇలాంటి సమయంలో తనకు సేఫ్ గా ఉండే ప్రాజెక్టులను ఎంచుకోవడమే.. చెర్రీకి కరెక్ట్ అనే సూచనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు చేస్తున్న ధృవ ఇలాంటి ప్రాజెక్టే అయినా.. ఇకపై కూడా మాస్ సినిమాలకు మొగ్గితేనే రామ్ చరణ్ కి సేఫ్ అంటున్నారు సినీ జనాలు.