చిరుతో కంటే ముందు మరో 'రంగస్థలం' చేస్తాడట!

Thu Apr 22 2021 23:00:01 GMT+0530 (IST)

Ram Charan And Sukumar Combo On Cards

ట్యాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో 'పుష్ప' సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. పుష్ప సినిమా తర్వాత సుకుమార్ సినిమా ఇప్పటికే ఖరారు అయ్యింది. విజయ్ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో సినిమా రూపొందబోతుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. ఇక సుకుమార్ ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా చేస్తాడనే వార్తలు వచ్చాయి. కథ విషయంలో కూడా చర్చలు జరిగాయంటూ ఆ మద్య ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందింది. విజయ్ దేవరకొండ తో సినిమా పూర్తి అయిన వెంటనే చిరంజీవితో సుకుమార్ సినిమా మొదలు పెట్టడం ఖాయం గా మీడియా వర్గాల్లో కూడా టాక్ వినిపించింది. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవితో కంటే ముందు చరణ్ తో సుకుమార్ మూవీ ఉంటుందని అంటున్నారు.రామ్ చరణ్ మరియు సుకుమార్ ల కాంబోలో ఇప్పటికే 'రంగస్థలం' సినిమా వచ్చింది. ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఆ సినిమా ఇప్పటికి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూనే ఉంది. రంగస్థలం తర్వాత సుకుమార్ చేస్తునన పుష్ప సినిమా పై కూడా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఇది కూడా ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. ఇక విజయ్ దేవరకొండతో చేయబోతున్న సినిమా ఎలా ఉంటుంది అనేది చూడాలి. రంగస్థలం తర్వాత అనుకోకుండా గ్యాప్ వచ్చిన కారణంగా సుకుమార్ తదుపరి సినిమాలకు గ్యాప్ రాకుండా ప్లాన్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ లో ఉన్నాడు. ఆ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో సినిమాను చేయబోతున్న విషయం తెల్సిందే. జులై నుండి శంకర్ దర్శకత్వంలో సినిమా పట్టాలెక్కబోతుంది. ఆ సినిమా వచ్చే ఏడాది చివరి వరకు పూర్తి అయ్యేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. విజయ్ దేవరకొండతో సినిమాను వచ్చే ఏడాది చివరి వరకు పూర్తి చేసి ఆ వెంటనే చరణ్ తో సుకుమార్ మరో రంగస్థలంను మొదలు పెట్టే అవకాశం ఉంది. మరి చిరంజీవితో సుకుమార్ ఎప్పుడు సినిమా చేస్తాడు అనేది చూడాలి. సుక్కు.. చరణ్ ల కాంబో మూవీ పై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.