Begin typing your search above and press return to search.

వీడియో: చెర్రీతో సానియా ఆ చిందులేమిటి!

By:  Tupaki Desk   |   14 Dec 2019 3:48 PM GMT
వీడియో: చెర్రీతో సానియా ఆ చిందులేమిటి!
X
సినిమా స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో టెన్నిస్ స్టార్ సానియా మీర్జా డ్యాన్సులు చూశారా? ఆ స్టెప్పులు చూస్తే షాక‌వ్వాల్సిందే. సినిమా స్టార్ల‌కు ధీటుగా డ్యాన్సుల‌తో అద‌ర‌గొట్టేసింది సానియా. అది కూడా రామ్ చ‌రణ్ లాంటి స్పీడ్ డ్యాన్స‌ర్ తో సానియా చెయ్యి చెయ్యి క‌లిపి స్టెప్పులేసిన వైనం ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ ఇద్ద‌రితో పాటుగా బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫ‌ర్ ఫ‌రాఖాన్ ఉన్నారు.

టెన్నిస్ దిగ్గ‌జం సానియా మీర్జా సోదరి ఆనం మీర్జా వివాహాం టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ తనయుడు అసద్ తో జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ పెళ్లి వేడుక‌కు అతిధులుగా విచ్చేసిన చ‌ర‌ణ్ .. ఫ‌రాఖాన్ ల‌తో క‌లిసి సానియా స‌ర‌దాగా స్టెప్పులేశారు.

ఇక ఇటీవ‌లే వెబ్ ని ఒణికించిన గుంగురే పాట‌కు ఈ ముగ్గురు స్టెప్పులేయ‌డంతో ఆ వీడియో కాస్తా అంతే వేగంగా వైర‌ల్ అయ్యింది. బాలీవుడ్ కండ‌ల హీరో హృతిక్ పాట‌ను సెలెక్ట్ చేసుకుని ఈ పెళ్లిలో ఒక‌టే హీటెక్కించారు చెర్రీ- సానియా బృందం. ఈ వీడియోని మెగా ఫ్యాన్స్ బాగానే వైరల్ చేస్తున్నారు. సానియాతో చ‌ర‌ణ్ - ఉపాస‌న జంట ఫోటోలు ఇప్ప‌టికే అంత‌ర్జాలంలో వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే.

వీడియో కోసం క్లిక్ చేయండి