క్రేజీ ఆఫర్ దక్కించుకున్న రకుల్...?

Tue Aug 11 2020 11:15:29 GMT+0530 (IST)

Rakul who got crazy offer ...?

అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ ఇండస్ట్రీకి పరిచయమై తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. మహేష్ బాబు రవితేజ ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ నాగచైతన్య రామ్ తదితర స్టార్ హీరోలతో నటించిన రకుల్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయింది. దాదాపు ఐదేళ్ల పాటు టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా రాణించింది. అంతేకాకుండా బాలీవుడ్ లోనూ మెరిసింది ఈ బ్యూటీ. ఈ క్రమంలో అజయ్ దేవగన్ తో 'దే దే ప్యార్ దే' అనే సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. రకుల్ ఈ సినిమాలో తన హీటెక్కించే అందాలతో బాలీవుడ్ జనాలను ఎంటర్టైన్ చేసింది.కాగా ఇప్పుడు ఈ సినిమాని సౌత్ లో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.  హిందీలో సూపర్ సక్సెస్ సాధించిన 'దే దే ప్యార్ దే' సౌత్ రీమేక్ లో కూడా రకుల్ ప్రీత్ సింగ్ నే హీరోయిన్ గా తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇదే కనుక నిజమైతే అమ్మడు మరోసారి తన అందాలకు పనిచెప్పి సౌత్ ఆడియన్స్ ని మెప్పించగలదని చెప్పవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడనున్నాయి. గతేడాది తెలుగులో ఒకే ఒక్క సినిమాలో నటించిన రకుల్ ప్రస్తుతం జాన్ అబ్రహం తో కలిసి 'ఎటాక్' మరియు అర్జున్ కపూర్ తో ఓ సినిమాలో నటిస్తోంది.

వీటితో పాటు కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న 'ఇండియన్ 2' మరియు శివ కార్తికేయన్ 'అయలాన్' చిత్రంలోనూ రకుల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక రమేష్ సిప్పి దర్శకత్వంలో రాజ్ కుమార్ రావ్ తో కలిసి నటించిన 'సిమ్లా మిర్చి' షూటింగ్ కంప్లీట్ చేసింది రకుల్. అంతేకాకుండా 'దేదే ప్యార్ దే'కి సీక్వెల్ గా రూపొందే సినిమాలో కూడా రకుల్ ని కొనసాగించే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య స్పీడ్ తగ్గించిన రకుల్ ఈ సినిమాలతో మళ్ళీ ట్రాక్ లోకి వస్తుందేమో చూడాలి.