బాలీవుడ్ హీరోలను తెలుగులో టీజ్ చేస్తున్న రకుల్..!

Mon Mar 01 2021 08:00:01 GMT+0530 (IST)

Rakul teasing Bollywood heroes in Telugu

ఇతర ఇండస్ట్రీల నుంచి ఇంపోర్ట్ అయ్యారంటే.. కెమెరా ముందు బట్టీబట్టిన డైలాగులు అప్పజెప్పడం.. అది కూడా చేతగాకపోతే 'వన్ టూ త్రీలు' చెప్పేసి వెళ్లిపోతుంటారు చాలా మంది హీరోయిన్లు. కానీ.. ఇంకో రకం హీరోయిన్లు కూడా ఉంటారు. వారు సినిమా పట్ల ప్యాషన్ తో ఉంటారు. నటన సరిగ్గా పండాలంటే భాష ఎంతో కీలకమని వారికి తెలుసు. వారు.. వచ్చీరాగానే భాష కూడా నేర్చుకోవడం మొదలు పెడతారు. రెండు మూడు సినిమాలు కంప్లీట్ అయ్యేనాటికే గళగళా మాట్లాడేస్తుంటారు.టాలీవుడ్ హీరోయిన్లలో చూస్తే.. ఇలాంటి వాళ్ల సంఖ్య ఎక్కువగానే ఉంది. తమన్నా సమంత రాశి ఖన్నా రకుల్ ప్రీత్ పూజా హెగ్డే రష్మిక మందన్నా.. వీరంతా ఇతర భాషలకు చెందిన హీరోయిన్లే అయినప్పటికీ.. తెలుగు మాత్రం అచ్చతెలుగు అమ్మాయిల్లా మాట్లాడేస్తుంటారు. నార్త్ బ్యూటీ రకుల్ ప్రీత్ తెలుగు ఫ్లుయెన్సీ చూస్తే.. నోరెల్లబెట్టాల్సిందే అంటే అతిశయోక్తి కాదు.

మన తెలుగుతో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్లను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోందట రకుల్. నితిన్ తో నటించిన కొత్త చిత్రం 'చెక్' తాజాగా రిలీజ్ అయ్యింది. ఈ నేపథ్యంతో మీడియాతో మాట్లాడింది రకుల్. తన తెలుగు గురించి అడగ్గా.. తాను ముంబయిలో కూడా తెలుగులోనే మాట్లాడతానని చెప్పిందీ బ్యూటీ. తన తొలిచిత్రం వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ నుంచీ సహాయకులు తెలుగు వాళ్లే ఉంటున్నారని ఆ విధంగా తెలుగు పర్ఫెక్ట్ అయ్యానని చెప్పింది రకుల్.

తాను హిందీలో చేస్తున్న 'సర్దార్ కా గ్రాండ్ సన్'కు సంబంధించి ఓ సాంగ్ షూట్ చేస్తుండగా.. రకుల్ తెలుగు భాషా ప్రావీణ్యం హిందీ హీరోకు కూడా అర్థమై నోరెళ్ల బెట్టాడట. ఈ పాట షూట్ చేస్తున్న సినిమాటోగ్రాఫర్ తెలుగువాడు కావడంతో.. అతనితో తెలుగులోనే మట్లాడిందట రకుల్. ఇది చూసి బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ ఆశ్చర్యపోయాడట. ''నీ పేరులో ప్రీత్ సింగ్ అని లేకపోతే.. ఖచ్చితంగా అందరూ నిన్ను తెలుగమ్మాయే అనుకునేవారు'' అని అన్నాడట. ఆ విధంగా హిందీ హీరోలతో జోకులు కూడా వేస్తోందట ఈ ఢిల్లీ బ్యూటీ.