లైఫ్ జాకెట్ లో రకుల్.. అడ్వెంచర్ ఎక్కడో మరి?

Wed May 18 2022 22:00:01 GMT+0530 (IST)

Rakul in life jacket

ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ మంచి  ప్రకృతి ప్రేమికురాలు. ఖాళీ  సమయం దొరికితే నేచురల్ అందాల్లో మమేకమైపోతుంది. నేచుర్ పై పరిశోధన సైతం ఎంతో ఇష్టం అంటుంది. ఇక  సాహస యాత్రలంటే ఇంకా ఇష్టం. ఒంటరిగా బేర్ గ్రిల్స్ లాంటి సాహసాలు చేయాలని ఉంటుంది. కానీ తాను నటి అయింది కాబట్టి ఆ స్కోప్ లేదు. అవును ఈ విషయాన్ని రకుల్ ఓ పాత  ఇంటర్వ్యూ సందర్భంలో వెల్లడించింది.అప్పుడప్పుడు తన కోర్కెల్ని సినిమా లో తన పాత్రల  రూపంలో దక్కితే ఎంతో సంతోష పడుతుంది. మరెంతో ఇష్టంగా నటించడానికి రెడీగా ఉంటుంది.  కొండపొలం లాంటి సినిమాతో పచ్చనైన ప్రకృతి అందాల్ని ఎంతగా ఆస్వాదించిందో ఆ సినిమా ప్రమోషన్ టైమ్ లో చెప్పుకొచ్చింది. తాజాగా అమ్ముడు అడ్వెంచర్ ట్రిప్ కి సంబంధించిన ఫోటో ఒకటి వైరల్ గా మారింది. అందులో రకుల్ ఆరెంజ్ కలర్ టీషర్ట్ పై  బ్లూ కలర్  లైప్ జాకెట్ ధరించి కనిపిస్తుంది.

క్యాజువల్ చుక్కల ప్యాంట్  లో కనిపిస్తుంది. అలాగే  ఎండ తీవ్రతని తట్టుకునేలా  కళ్లకి కూలింగ్ గ్లాసెస్...తలకి టోపీ పెట్టుకుని స్పాట్ నుంచి కొన్ని ఫోటోల్ని లిక్ చేసింది. మరి  ఈ లొకేషన్ ఎక్కడ? అన్నది తెలియదు గానీ...రకుల్ మాత్రం అడ్వెంచర్  ట్రిప్ ని బాగా ఆస్వాదిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ లో పెద్ద పెద్ద బండరాయి కొండలా కనిపిస్తుంది. మరి ఆ కొండ మీద  నుంచి కిందకి దూకి ఇలా ఫోజిచ్చిందా? ఏంటో? మరి. ఏదేమైనా రకుల్ కొత్త ఫోటో ఫాలోవర్లకి బ్రేకిచ్చినట్లు అయింది.

వరుసగా హాట్ ఫోటోలు చూసి బోర్ కొట్టిన జనాలకి ఇది విరామం లాంటి పిక్.  రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా  కనిపిస్తున్న ఫోటో కావడంతో రకుల్  సాహస యాత్ర కోసం ఎక్కడికి వెళ్లిందంటూ ప్రశ్నిస్తున్నారు. మరి ఆ సంగేతంటి? అన్నది రకుల్ రివీల్ చేస్తే గాని క్లారిటీ రాదు.

ఇక రకుల్ సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్ లో నటిగా బిజీగా ఉంది. `డాక్టర్ జీ` అనే  సినిమాలో నటిస్తోంది. చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే రిలీజ్ కానుంది.  అలాగే `ఛత్రవాలీ` అనే మరో సినిమాలో  కూడా నటిస్తోంది. ఇది షూటింగ్ దశలో ఉంది. `ఎటాక్`..`రన్ వే`..`థాంక్ గాడ్`..`మిషన్ సిండ్రాల్లా నటిస్తోంది`. వీటిలో కొన్ని చిత్రాలు షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి.

ఇక కోలీవుడ్ లో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `ఇండియన్ -2`లో నటిస్తోంది. ఈ సినిమాపై రకుల్ చాలా ఆశలు పెట్టుకుంది.  తెలుగులో `31 అక్టోబర్  లేడీస నైట్` లో నటిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగు..తమిళ్ లో తెరకెక్కిస్తున్నారు.