Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: ర‌కుల్.. మైండ్ బ్లాకింగ్ లుక్

By:  Tupaki Desk   |   10 Dec 2019 3:30 PM GMT
ఫోటో స్టోరీ: ర‌కుల్.. మైండ్ బ్లాకింగ్ లుక్
X
న‌వ‌త‌రం క‌థానాయిక‌ల్లో ర‌కుల్ ప్రీత్ సింగ్ మైండ్ సెట్ గురించి.. ప్లానింగ్ గురించి చెప్పాల్సిన ప‌నేలేదు. ఓవైపు సినిమాల్లో స్టార్ డ‌మ్ పీక్స్ కి చేరుకోగానే తెలివిగా ఎఫ్ 45 పేరుతో జిమ్ బిజినెస్ ప్రారంభించింది. ఫిట్ నెస్ జిమ్ బిజినెస్ ను త‌న‌దైన ప్ర‌చారంతో స‌క్సెస్ చేసింది. ప్ర‌స్తుతం అన్ని మెట్రోల‌కు జిమ్ ల‌ను విస్త‌రిస్తోంది. క‌థానాయికా ఫేడ‌వుట్ కాక‌ముందే ఇత‌రత్రా బిజినెస్ మార్గాల్ని ఈ అమ్మడు వెతుకుతోంది.

ఇక సోష‌ల్ మీడియాలో నిరంతరం ఫోటోషూట్లతోనూ అభిమానుల‌కు ట‌చ్ లో ఉంటోంది. తాజాగా ఎఫ్‌.హెచ్.ఎం మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై అదిరిపోయే ఫోజుతో చెల‌రేగింది. ర‌కుల్ స్ట‌న్నింగ్ థై స్లిట్ అవ‌తారం ఫ్యాన్స్ లో కి జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. బ్లాక్ డిజైన్ డ్రెస్ ధ‌రించింది. దానిపై ఓ బ్లూ కోట్ తో ఇచ్చిన క‌వ‌రింగ్ చూడ‌గానే.. ర‌కుల్ నెవ్వ‌ర్ బిఫోర్ అన్నంత హాట్ గా క‌నిపిస్తోంది. కార్పొరెట్ లుక్ కి రిలేటెడ్ గా బ్లాక్ అండ్ బ్రౌనిష్ హెయిర్ .. ఐ లెన్స్ తో మ‌తి చెడ‌గొట్టింది.

ర‌కుల్ కెరీర్ సంగ‌తిని ప‌రిశీలిస్తే.. విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ క‌థానాయ‌కుడిగా శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న భార‌తీయుడు 2లో జాక్ పాట్ కొట్టేసింది. అలాగే త‌మిళ క్రేజీ హీరో శివ‌కార్తికేయ‌న్ స‌ర‌స‌న ఈ అమ్మ‌డు న‌టిస్తోంది. ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని వేరొక క్రేజీ చిత్రంలోనూ ర‌కుల్ న‌టిస్తోంది. ఇక మ‌న్మ‌ధుడు 2 త‌ర్వాత టాలీవుడ్ లో ర‌కుల్ జోరు త‌గ్గిన సంగ‌తి తెలిసిందే. తిరిగి ఎప్ప‌టికి ఇక్క‌డ‌ బౌన్స్ బ్యాక్ అవుతుందో చూడాలి.