వేశ్యగా రకుల్ ప్రీత్ సాహసం...!

Mon Jul 13 2020 12:20:49 GMT+0530 (IST)

Rakul Preet as a Prostitute?

వేశ్య పాత్రకు ఉండే క్రేజ్ అలాంటిది. నటిగా నిరూపించుకునేందుకు బోలెడంత స్కోప్ దొరుకుతుంది. ఇప్పటికే పలువురు బాలీవుడ్ టాలీవుడ్ నాయికలు వేశ్య పాత్రల్లో అద్భుత అభినివేశంతో మెప్పించారు. మాధురి ధీక్షిత్ - టబు-ప్రియాంక చోప్రా- విద్యాబాలన్- కరీనా కపూర్ లాంటి బాలీవుడ్ అగ్ర కథానాయికలు వేశ్య పాత్రల్లో మైమరిపించారు. టాలీవుడ్ లోనూ మంజు భార్గవి - జయసుధ - భాను ప్రియ లాంటి టాప్ హీరోయిన్స్ వేశ్య పాత్రల్లో మురిపించారు. వేదం చిత్రంలో అనుష్క వేశ్య పాత్రలో సరికొత్త ఆహార్యంతో మెప్పించింది.అదంతా సరే కానీ.. అంతగా ఆఫర్లు లేక సతమతమవుతున్న రకుల్ ప్రీత్ సింగ్ చేస్తున్న తాజా ప్రయోగం చూస్తే షాక్ తినాల్సిందే. ఈ అమ్మడు కూడా సీనియర్ల బాటలోనే వేశ్య పాత్రతో రీబూట్ అవ్వాలని ప్రయత్నిస్తోందట. గత కొంతకాలంగా టాలీవుడ్ లో కెరీర్ ఖాళీ అయిపోయింది. `మన్మధుడు 2` తర్వాత ఇక్కడ ఆఫర్ అన్నదే లేదు.

ఆ క్రమంలోనే ముంబై పరిశ్రమలో చేయని ప్రయత్నం లేదు. ఇప్పటికే బాలీవుడ్ లో `మర్జవాన్` సినిమాలో మోడ్రన్ వేశ్య పాత్రలో నటించి తన హాట్ హాట్ అందాలతో హిందీ ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేయడానికి రకుల్ ప్రయత్నించింది. ఇప్పుడు మరోసారి అలాంటి పాత్రే దక్కడం విశేషం. బాంబే రెడ్ లైట్ ఏరియాలో ఉన్న ఓ మోస్ట్ పాపులర్ వేశ్యకి సంబంధించిన నిజజీవిత గాథ అధారంగా తెరకెక్కుతున్న తాజా బయోపిక్ లో రకుల్ లీడ్ రోల్ చేసేందుకు సంతకం చేసిందని సమాచారం. రకుల్  ఇప్పటికే `భారతీయుడు 2`లో రెండో నాయికగా నటిస్తోంది. వేరొక హిందీ చిత్రంలోనూ నటిస్తోంది.