రేప్ కేసుల గురించి చదువుతుంటే రక్తం సలసలా

Wed Jun 09 2021 13:00:19 GMT+0530 (IST)

Rakul Preet Talking About Rapes In India

ప్రజలు కరోనాతో చస్తున్నారు. ఇలాంటి మహమ్మారీ కష్టంలో ఓవైపు ఘోరమైన అత్యాచారాలు జరుగుతున్నాయి. అసలు మీరు మనుషులేనా? తలుచుకుంటేనే రక్తం మరుగుతోంది..!! అంటూ కోపాన్ని ప్రదర్శించారు రకుల్ ప్రీత్ సింగ్. ఓవైపు లోకం అల్లకల్లోలంగా ఉంటే కరోనాతో అల్లాడుతుంటే మానవత్వం మరిచారా? అని సూటిగా ప్రశ్నించారు రకుల్.ఇటీవల వార్తా పత్రికల్లో నిరంతరం అత్యాచారాల గురించి చదువుతున్నానని అలా చదివేప్పుడు కడుపు రగిలిపోతోందని రక్తం సలసలా కాగిపోతోందని రకుల్ అన్నారు. ఈ కష్టకాలంలో ఒకరికొకరం సాయంగా ఉండాలి. మంచి మానవతతో ఉండాలి కానీ ఇలాంటి దారుణాలకు ఒడికడతారా? అంటూ రకుల్ సూటిగా నిలదీశారు.

కోవిడ్ -19 సంక్షోభం చూసాక కూడా మానవత్వంతో మేల్కొనకపోతే అది అత్యంత పాశవికం అని అన్నారు రకుల్. ఇటీవల మానేసర్ లో ఒక అత్యాచారం కేసు గురించి చదివాను. నా రక్తం అలాంటి వార్తలను చదివేటట్లు చేస్తోంది. నా ఉద్దేశ్యం ఏమిటంటే ప్రజలు ఓవైపు చనిపోతున్నారు. ఈ మహమ్మారితో ప్రపంచం కష్టపడుతోంది. ఆపై ఇలాంటి దుర్మార్గపు వ్యక్తులు కూడా సంఘంలో ఉన్నారు. దీని నుండి బయటపడాలంటే ఏం చేయాలో నాకు తెలియదు. మమ్మల్ని మనుషులు అని పిలవాలా అని కొన్నిసార్లు ప్రశ్న ఎదురవుతోంది! అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆనందంగా గడిపే క్షణాలు చాలా చిన్నవి.. చాలా అనూహ్యమైనవి. మీరు దానిని ఆ కోణం నుండి అర్థం చేసుకోవడం ప్రారంభిస్తేనే జీవితాన్ని చాలా భిన్నంగా చూస్తారు. మీరు ఈరోజును జీవించేటప్పుడు చిన్న విషయాలను కూడా విలువైనదిగా భావిస్తారు. కాబట్టి ప్రజలు మంచిగా మారుతారని నేను ఆశిస్తున్నాను`` అని రకుల్ వ్యాఖ్యానించారు. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ! మనుషులు మారతారనే ఆశిద్దాం.