ఫొటో స్టోరీ: బాబోయ్ కిక్కిస్తున్న మత్తు కళ్లు

Wed Nov 20 2019 13:15:01 GMT+0530 (IST)

Rakul Preet Sngh New Photo Shoot

నీ కళ్లలో చూస్తు ఉంటే క్వాటర్ తాగినంత మత్తు వచ్చేస్తోంది... ఆ క్వాటర్ ఇచ్చే మత్తు కంటే నీ కళ్లలోకి చూస్తే వచ్చే మత్తు మహా గమ్మత్తుగా ఉంది అంటూ ఒక సినిమా కవి రాసిన డైలాగ్ ఈ ఫొటోలోని రకుల్ ప్రీత్ సింగ్ ను చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. కొన్ని సెకన్లు ఆమె కళ్లలోకి చూస్తే మత్తెక్కుతుందా అన్నట్లుగా ఈమె కళ్లు ఉన్నాయి. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగి ఈమద్య కాస్త ప్రాభవం కోల్పోయింది. అయినా కూడా మళ్లీ పునర్ వైభవంను సాధిస్తాననే నమ్మకం ఆమెలో కనిపిస్తుంది.హాట్ ఫొటో షూట్స్ తో సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ ను మత్తులో ముంచెస్తోంది. ఈ అమ్మడి ఫొటో షూట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఈ ఫొటో కూడా సోషల్ మీడియాలో మరోసారి సందడి చేస్తోంది. ఎల్లో డ్రస్ లో సాదారణంగానే అమ్మాయిలు చాలా బాగుంటారు. అలాంటిది కాస్త హాట్ గా మత్తెక్కించే కళ్లతో ఈ అమ్మడి ఫోజ్ ఇస్తే జనాలు ఇంకేమైనా ఉందా కిందా మీదా పడిపోరా అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

ఇక రకుల్ సినిమాల విషయానికి వస్తే తెలుగులో ఆఫర్లు రాకపోవడంతో తమిళంలో ప్రయత్నాలు చేసింది. అక్కడ వరుసగా సినిమాలు చేసింది. అయితే ఇప్పుడు అక్కడ కూడా పెద్దగా ఆఫర్లు ఉన్నట్లుగా లేవు. చిన్న చిన్న సినిమాలతో పాటు బాలీవుడ్ లో కూడా నటిస్తున్న ఈ అమ్మడు తమిళంలో చేస్తున్న ఇండియన్ 2 చిత్రంపై ఆశలు పెట్టుకుని ఉంది. ఆ సినిమాలో రకుల్ పాత్ర ఏంటీ అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.