ఫోటో స్టోరీ: చీర కట్టిన బ్యూటిఫుల్ రకుల్

Mon Jan 20 2020 14:42:58 GMT+0530 (IST)

Rakul Preet Singh in Saree

హీరో హీరోయిన్ల తమ కెరీర్లో ఎప్పుడో ఒకసారి డల్ ఫేజ్ చూడాల్సి ఉంటుంది. టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ప్రస్తుతం అలాంటి దశలోనే ఉంది. తమిళంలో.. హిందీలో అవకాశాలు ఉన్నప్పటికీ తెలుగులో మాత్రం చెప్పుకోదగ్గ ఆఫర్లు లేవు. అయితే రకుల్ మాత్రం ఇదంతా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూనే సోషల్ మీడియాలో ఎప్పుడూ లైమ్ లైట్ లో ఉండేందుకు ప్రయత్నిస్తోంది.తరచుగా హాట్ ఫోటో షూట్లు చేస్తూ వాటితో గ్లామర్ ఐకాన్ అనిపించుకునే ప్రయత్నాలలో ఉంది. తాజాగా రకుల్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. ఈ ఫోటోలకు "లవీ" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఫోటోలలో రకుల్ తళుకులు ఉండే సిమెంట్ కలర్ చీర.. స్లీవ్ లెస్ బ్లౌజు ధరించి వయ్యారంగా పోజులిచ్చింది. కొంచెం కూడా ఎక్కువ కాకుండా చేసుకున్న మేకప్.. ఆకర్షణీయంగా ఉన్న హెయిర్ స్టైల్.. తో సెన్సువల్ ఎక్స్ ప్రెషన్లు ఇస్తూ మగజాతి హృదయాలను రంపంతో కోస్తూ.. ఆడవారి హృదయాలను అసూయతో రగిలిపోయేలా చేస్తోంది. హాట్ నెస్ కూడా టన్నుల్లో ఉంది.

ఈ ఫోటోలకు కళాత్మక హృదయాలైన నెటిజన్లు స్పందించారు. "వెరీ బ్యూటిఫుల్.. వెరీ క్యూట్".. "చీరలో హాట్ గా ఉన్నావు".. "కిల్లర్ బ్యూటీ" అంటూ కామెంట్లు పెట్టారు. రకుల్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే కమల్ హాసన్- శంకర మూవీ 'ఇండియన్ 2' లో.. శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న మరో తమిళ సినిమాలో నటిస్తోంది. ఇది కాకుండా హిందీలో మరో సినిమాలో నటిస్తోంది.