Begin typing your search above and press return to search.

విజ‌యాల కొండ‌పైనే క‌న్నేసింది!

By:  Tupaki Desk   |   12 Oct 2019 5:30 PM GMT
విజ‌యాల కొండ‌పైనే క‌న్నేసింది!
X
`మ‌న్మ‌ధుడు 2` రిజ‌ల్ట్ ప్ర‌భావం అక్కీనేనీస్ తో పాటు ర‌కుల్ పైనా తీవ్రంగానే ప‌డింది. ఈ సినిమా ఫ్లాప్ లో ర‌కుల్ కి భాగం ఇస్తూ .. ఈ అమ్మ‌డికి ఇక టాలీవుడ్ లో ఛాన్సులే లేవు అంటూ ప్ర‌చారం సాగించ‌డం ర‌కుల్ వ‌ర‌కూ వెళ్లింద‌ట‌. ఆ నోటా ఈనోటా ఈ మాట విన్న ర‌కుల్ హ‌ర్ట‌యిన‌ట్టే క‌నిపిస్తోంది. అందుకే అభిమానుల‌కు సందేహాలు తీర్చేందుకు ఓ ఇంట‌ర్వ్యూలో ప‌ని గ‌ట్టుకుని కొన్ని విష‌యాల్ని ఖ‌రాకండిగా చెప్పేసింది.

ఫ్లాపులు వ‌చ్చినంత మాత్రాన నాకు అవ‌కాశాలేవీ త‌గ్గ‌లేదు. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో న‌టిస్తున్నా. అందుకే ద‌క్షిణాదిన అవ‌కాశాలు వ‌చ్చినా ఒప్పుకోవ‌డం లేదు అని వివ‌ర‌ణ ఇచ్చింది. అలాగే ఏదో మూడు పాట‌లు.. నాలుగు సీన్లు త‌ర‌హా సినిమాలు ఇక‌పై చేయ‌న‌ని ఖ‌రాకండిగా చెప్పింది. ఇలాంటివి చేయ‌డం వ‌ల్ల‌నే ఫ్లాపులు వ‌చ్చి నెగెటివ్ ప్ర‌చారానికి దారి తీస్తోంద‌ని తెలిపింది.

ప‌నిలో ప‌నిగా ప్ర‌స్తుతం మాంచి జోరుమీదున్న ఎన‌ర్జిటిక్ బోయ్స్ ఇద్ద‌రిపై ర‌కుల్ మ‌న‌సు పారేసుకున్నాన‌ని చెప్పింది. ఆ ఇద్ద‌రి స‌ర‌స‌నా న‌టించే ఛాన్స్ వ‌స్తే ఏమాత్రం విడిచిపెట్ట‌న‌ని తెలిపింది. అందులో ఒక‌రు టాలీవుడ్ రౌడీ విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఇంకొక‌రు బాలీవుడ్ ఎన‌ర్జిటిక్ బోయ్ ర‌ణ‌వీర్ సింగ్. ప్ర‌స్తుతం ఈ ఇండ‌స్ట్రీలో రౌడీ హ‌వా సాగుతోంది. ఆ ఇండ‌స్ట్రీలో ర‌ణ‌వీర్ హ‌వా న‌డుస్తోంది. అందుకే తెలివిగా ఈ అమ్మ‌డు ఆ ఇద్ద‌రినీ ఎంపిక చేసుకుంద‌ని అర్థ‌మ‌వుతోంది. మొత్తానికి హిట్టు హీరోలైనా త‌న‌కో హిట్టిస్తార‌నే ఆశ కావొచ్చు!! క‌మ‌ల్ హాస‌న్ స‌ర‌స‌న భార‌తీయుడు 2లో .. శివ‌కార్తికేయ‌న్ స‌ర‌స‌న ఓ ప్ర‌యోగాత్మ‌క చిత్రంలో నటిస్తోంది ర‌కుల్. అటు బాలీవుడ్ లో సిద్ధార్థ్ మ‌ల్హోత్రాతో అవ‌కాశం అందుకుంది