పాత్ర కోసం 10 కిలోలు తగ్గిన బ్యూటీ

Mon Apr 15 2019 16:04:40 GMT+0530 (IST)

Rakul Preet Singh Reduce Her Weight For De De Pyaar De Movie

ఇప్పుడు ట్రెండ్ అంటే కేవలం హీరోలు సిక్స్ ప్యాక్ ట్రై చేయడం కాదు. డిమాండ్ చేస్తే హీరొయిన్ అయినా ఒళ్ళు వంచాల్సిందే. కథకు తగ్గట్టు బాడీని మార్చుకోవలసిందే. ఆ మధ్య సైజ్ జీరో కోసం అనుష్క బాగా బరువు పెరిగిపోయి చాలా ఇబ్బందులు పడటం  అభిమానులు ఇంకా మర్చిపోలేదు. పెళ్ళయ్యాక పెరిగిన వెయిట్ ని తగ్గించుకోవడం కోసం కరీనా కపూర్ పడిన పాట్లు అన్ని ఇన్ని కావు.ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ వంతు వచ్చింది. వచ్చే నెల 17న విడుదల కాబోతున్న దే దే ప్యార్ దే మీద తనకు మాములు ఆశలు లేవు. 50 ఏళ్ళ వయసున్న హీరో పాత్రతో ప్రేమలో పడే పడుచు అమ్మాయిగా ఇందులో చాలా డిఫరెంట్ రోల్ చేస్తోంది. ప్రమోషన్ లో సైతం అలుపు లేకుండా పాల్గొంటోంది. దీనికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది రకుల్

మొదట ఈ పాత్ర ఆఫర్ చేసినప్పుడు దర్శకుడు ఆకివ్ అలీ నిర్మాత లవ్ రంజన్ బరువు తగ్గమని చెప్పారట. అచ్చంగా కాక్ టైల్ లో దీపికా పదుకునే తరహాలో బాగా సన్నబడాలని సూచించారు. దాంతో స్వంతంగా జిమ్ ఉన్న తను నో చెప్పడం భావ్యం కదాని భావించి వెంటనే ఓకే చెప్పిందట . నెల రోజుల పాటు కఠిన శిక్షణ తీసుకుని కోరుకున్న షేప్ ని సాధించిందట. ఆహార అలవాట్లు మార్చుకోవడం కష్టం అనిపించినా దానికీ రెడీ అయ్యింది.

మొత్తానికి దాని తాలుకు ఫలితాన్ని సాంపిల్ రూపంలో ట్రైలర్ లో రకుల్ మందు కొట్టి డాన్స్ చేసిన వీడియో సాంగ్ లోనూ చూడొచ్చు. దే దే ప్యార్ లో పాత్ర రిస్క్ తో కూడుకున్నదే అయినప్పటికీ ఛాలెంజ్ గా తీసుకున్నానని చెబుతున్న రకుల్ ఒకవేళ సౌత్ లో ఇంతకు ముందులా డిమాండ్ పీక్స్ లో ఉండి ఉంటే ఒప్పుకునేదా అనే ప్రశ్నకు సమాధానం తనకు మాత్రమే తెలుసు