Begin typing your search above and press return to search.

ఇప్పుడు కష్టం అంటున్న రకుల్

By:  Tupaki Desk   |   3 Dec 2015 5:30 PM GMT
ఇప్పుడు కష్టం అంటున్న రకుల్
X
సందీప్ కిషన్ - రకుల్ ప్రీత్ సింగ్ లు ఒకే సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేసిన విషయం మనకు తెలుసు. వీరిద్దరకూ కలిసి నటించిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సూపర్ హిట్ గా నిలిచింది. ఇద్దరికీ వరుస ఆఫర్స్ ను తెచ్చిపెట్టింది. అప్పుడు వచ్చిన ఊపుతో.. రకుల్ బాగా స్పీడ్ పెంచేసింది. టాప్ స్టార్స్ పక్కన చేసేస్తోంది.

ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో నటించింది. త్వరలో ఈ చిన్నది యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో నటించిన నాన్నకు ప్రేమతో రిలీజ్ కు రెడీ అవుతోంది. మరో వైపు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరైనోడులో కూడా లీడ్ హీరోయిన్ రోల్ పోషిస్తోంది. సాధారణంగా ఒకేసారి ఇండస్ట్రీలో ప్రవేశించిన నటులమధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది. రకుల్ - సందీప్ ల మధ్య కూడా ఈ రిలేషన్ ఉంది. ఆ చొరవతో.. సందీప్ చేయబోతున్న లేటెస్ట్ ఫిల్మ్.. తమిళ నేరం రీమేక్ లో చేయాల్సిందిగా రకుల్ ని కోరాడు. అయితే.. ప్రస్తుతం మహేష్ తో ఆఫర్ కోసం వెయిట్ చేస్తున్న రకుల్ ప్రీత్.. ఫ్లాప్ లలో ఉన్న సందీప్ కిషన్ ఆఫర్ ని తిరస్కరించింది.

ఇంతకు ముందు కూడా రామ్ నుంచి వచ్చిన ఓ ఆఫర్ ని ఇలాగే కాదు పొమ్మంది రకుల్ ప్రీత్ సింగ్. నేను శైలజ చిత్రంలో రకుల్ కాదన్నాకే.. కీర్తి సురేష్ ని తెచ్చాకున్నాడు రామ్. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే.. రకుల్ నో చెప్పాక.. కీర్తి సురేష్ ని తెచ్చుకున్నాడు రామ్. ఇప్పుడు అదే కీర్తి సురేష్ ని సందీప్ కిషన్ కూడా ఎంగేజ్ చేయడం విశేషం.