Begin typing your search above and press return to search.

రకుల్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై క్లారిటీ ఇచ్చిన మేనేజర్..!

By:  Tupaki Desk   |   25 Nov 2020 2:00 PM GMT
రకుల్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై క్లారిటీ ఇచ్చిన మేనేజర్..!
X
సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది బ్యూటీ రకుల్‌ ప్రీత్ సింగ్‌. సూపర్ స్టార్ మహేష్ బాబు - రవితేజ - ఎన్టీఆర్ - రామ్ చరణ్ - అల్లు అర్జున్ - నాగచైతన్య - రామ్ వంటి స్టార్ హీరోల సరసన నటించిన రకుల్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయింది. దాదాపు ఐదేళ్ల పాటు తెలుగు తమిళ హిందీ భాషల్లో క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలో రకుల్ నటించే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై వస్తున్న రూమర్స్ కి చెక్ పెడుతూ ఆమె మేనేజర్ హరినాథ్ క్లారిటీ ఇచ్చాడు. రకుల్ ప్రస్తుతం 'చెక్' సినిమాలో యూత్ స్టార్ నితిన్ స‌ర‌స‌న హీరోయిన్ గా న‌టిస్తోంది. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రకుల్ అడ్వకేట్ పాత్రలో కనిపించనుంది. దీంతో పాటు మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ - క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాలో కూడా రకుల్ నటిస్తోంది. రకుల్ పల్లెటూరి అమ్మాయిగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది.

బాలీవుడ్ లో కూడా రకుల్ ప్రీత్ సింగ్ వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. స్టార్ హీరో జాన్ అబ్రహాంతో కలిసి 'ఎటాక్' అనే సినిమాలో నటిస్తోంది. అలానే అర్జున్ కపూర్ తో కలిసి ఓ సినిమా చేస్తోంది రకుల్. బిగ్ బి అమితాబ్ బచ్చన్ - అజయ్ దేవగన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'మే డే' సినిమాలో కూడా రకుల్ హీరోయిన్ గా ఎంపికైంది. ఇలా మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ తో రకుల్ బాలీవుడ్ లో బిజీగా మారిపోయింది. ఇక కోలీవుడ్ లో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న 'అయలాన్' చిత్రంలోనూ రకుల్ నటిస్తోంది. ఏదేమైనా ర‌కుల్ భాషతో సంబంధం లేకుండా వరుస ఆఫర్స్ దక్కించుకుంటూ బిజీ హీరోయిన్ గా గడుపుతూ.. త‌న ఫామ్ ఇంకా త‌గ్గ‌లేద‌ని నిరూపిస్తోంది.