మామ గారి బ్యానర్ ని ఆ కుర్ర హీరోని వదిలిపెట్టని రకుల్

Sun Jul 03 2022 21:00:01 GMT+0530 (IST)

Rakul Preet Singh Latest Photo

ఇటీవలే మలైకా అరోరాఖాన్ తో కలిసి విదేశాల్లో బర్త్ డే సెలబ్రేషన్స్ లో మునిగి తేలాడు అర్జున్ కపూర్. ఇంతలోనే తిరిగి తన సినిమాల సెట్స్ కి వచ్చేస్తున్నాడు. తాజా సమాచారం మేరకు అతడు రకుల్ ప్రీత్ సింగ్ తో కలిసి `మేరి పత్నీ కా..` రీమేక్ లో నటించనున్నాడు. అర్జున్ కపూర్- రకుల్ ప్రీత్ సింగ్ - భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రల్లో ముదస్సర్ అజీజ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.నిజానికి అర్జున్ తో రకుల్ కి ఇదే మొదటిసారి కాదు. బోనీ తనయుడితో ఇంతకుముందు సర్దార్ కా గ్రాండ్ సన్ చిత్రంలో నటించింది. ఇంతలోనే మరో క్రేజీ ఆఫర్ ని అందుకుంది. మరోవైపు అర్జున్ కపూర్ - భూమి పెడ్నేకర్ ఇప్పటికే ది లేడీ కిల్లర్ కోసం కలిసి షూటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఆన్ స్క్రీన్ జంటకు ట్విస్ట్ ఇస్తూ రకుల్ ప్రీత్ సింగ్ ప్రాజెక్ట్ లో ఎంటరైంది. ఈ ముగ్గురూ తమ తదుపరి ప్రాజెక్ట్ కోసం ప్రిపరేషన్ లో ఉన్నారు. `మేరీ పట్నీ కా రీమేక్` అనే తాత్కాలిక టైటిల్ వైరల్ అవుతోంది.  

`హ్యాపీ భాగ్ జాయేగీ` దర్శకుడు ముదస్సర్ అజీజ్ మొదటిసారిగా అర్జున్- రకుల్ బృందంతో పని చేస్తున్నారు. ఇది క్రేజీ కామెడీ ఎంటర్ టైనర్. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ వెంచర్ కు ముందు ఆ ఇద్దరు హీరోయిన్లు అర్జున్ సరసన జతకట్టారు. ది లేడీ కిల్లర్ ఇప్పటికే సెట్స్ లో ఉండగా.. ఇందులో భూమి పెడ్నేకర్ కథానాయిక. అలాగే రకుల్ సర్దార్ కా గ్రాండ్ సన్ లో అర్జున్ కి ప్రియురాలిగా నటించింది.  తాజా చిత్రం 90ల నాటి గోవిందా కామెడీ నాస్టాల్జిక్ మెమరీగా ఉంటుందని తెలుస్తోంది.

పూజా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వాసు భగ్నాని (రకుల్ మామగారు) నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ అతడి సొంత కుటుంబ బ్యానర్లలో నటించేందుకు ఆసక్తిగా ఉన్న సంగతి తెలిసిందే. బోనీ కుటుంబంతో భగ్నానీలకు చక్కని సంబంధాలున్నాయి. మామ గారి బ్యానర్ కే రకుల్ ప్రయారిటీ? ఇస్తోందన్నది అర్థమవుతోంది. అర్జున్ కూడా బ్యాక్ టు బ్యాక్ రకుల్ ప్రీత్ తో కలిసి నటిస్తుండడం ఆసక్తికరం. మరోవైపు అక్షయ్ కుమార్ - ముదస్సర్ అజీజ్ చిత్రం చాలా కాలం తర్వాత 2023లో సెట్స్ పైకి వెళ్తుందని చెబుతున్నారు. మేకర్స్ ఇంకా కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మేరీ పత్నీ కా రీమేక్ గురించి ఇతర వివరాలను కూడా వెల్లడించాల్సి ఉంది.