అడ్డూ ఆపూ లేని బికినీ ట్రీట్ ఎందుకు?

Sun Jan 26 2020 13:23:27 GMT+0530 (IST)

Rakul Preet Singh In Bikini

ఇటీవల సోషల్ మీడియా వెల్లువతో సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతి విషయం నెటిజనులకు ఈజీగా తెలిసిపోతోంది. అందాల భామల నిరంతర ఫోటోషూట్లతో పాటు వ్యక్తిగత విషయాల్ని షేర్ చేస్తుండడంతో ఎవరి సంగతి ఏమిటో నెటిజనులే విశ్లేషిస్తున్నారు. ముద్దుగుమ్మల కెరీర్ తడబాటు ఇట్టే అర్థం చేసుకుని కామెంట్లతో వేడెక్కిస్తున్నారు.సామాన్యులు సైతం టిక్ టాక్ ట్రెండ్ కి సోషల్ మీడియా ట్రెండ్ కి అలవాటు పడి కథానాయికల మైండ్ సెట్ ని రీడ్ చేసి అసలేం జరుగుతోందో ఊహించేస్తున్నారు. ఆ కోవలో చూస్తే ఇటీవల గత కొంతకాలంగా అందాల రకుల్ వ్యవహారం ఏదో తేడా కొడుతోందనే సందేహం వ్యక్తమవుతోంది. 2018-19 రకుల్ కి బ్యాడ్ సీజన్. ఎన్నో ఆశలు పెట్టుకున్న స్పైడర్.. మన్మధుడు 2 లాంటి చిత్రాలు డిజాస్టర్ అవ్వడం తనకు బాగా మైనస్ అయ్యింది. అప్పటివరకూ తనకు ఉన్న క్రేజు సాంతం జీరో అయిపోయింది. తెలుగులో ప్రస్తుతం అవకాశాల్లేని పరిస్థితి ఎదురైంది.

ఆ క్రమంలోనే ఇరుగుపొరుగు పరిశ్రమల్లో ప్రయత్నిస్తోంది. ఇక రెగ్యులర్ గా సోషల్ మీడియాల్లో ఈ అమ్మడి వ్యవహారం అంతే వేడెక్కిస్తోంది. ఇంతకుముందు ఎగ్జోటిక్ బీచ్ లొకేషన్ నుంచి బికినీ ఫోటోలతో విరుచుకుపడింది. తాజాగా మరోసారి స్విమ్ సూట్ లో దర్శనమిచ్చింది. ఈసారి జలవిహారంలో తడిసిముద్దయిన రకుల్ ఫోటోలు జోరుగా వైరల్ అవుతున్నాయి. కెరీర్ ఖాళీ అయిపోవడంతో రకుల్ కి కావాల్సినంత టైమ్ దొరుకుతోందా? అంటూ మరోసారి కామెంట్లు గుప్పిస్తోంది యూత్.  కనీసం ఈ ప్రయత్నం చూసాక అయినా ముంబై పరిశ్రమ నుంచి అయినా పిలుపు అందుతుందేమో చూడాలి.