సమంతకు స్టార్ హీరోయిన్ కాంప్లిమెంట్

Wed May 22 2019 13:30:09 GMT+0530 (IST)

Rakul Preet Singh Give Complement To Samantha

వరుసగా స్టార్ హీరోలతో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ ఒక్కసారిగా డల్ అయ్యింది. దాంతో ఇక రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ ఖతం అయినట్లే అనుకున్నారు. అయితే రకుల్ ప్రయత్నాలు గట్టిగానే చేస్తోంది. తాజాగా ఈమె బాలీవుడ్ లో 'దే దే ప్యార్ దే' చిత్రంలో అజయ్ దేవగన్ కు జోడీగా నటించింది. ఆ సినిమాలో రకుల్ అందాల ప్రదర్శణతో పాటు మంచి నటనను కబర్చిందంటూ టాక్ వచ్చింది. బాలీవుడ్ లో రకుల్ కు ఛాన్స్ లు దక్కే అవకాశం ఉందనిపిస్తుంది. ఇదే సమయంలో ప్రస్తుతం నాగార్జునకు జోడీగా 'మన్మధుడు 2' చిత్రంలో ఈ అమ్మడు నటిస్తోంది.దే దే ప్యార్ దే సక్సెస్ నేపథ్యంలో సోషల్ మీడియాలో అభిమానులతో రకుల్ చిట్ చాట్ చేసింది. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఈ సందర్బంగా ఆమె సమంత గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఒక అభిమాని మీకు తోటి హీరోయిన్స్ లో ఎవరంటే మీకు ఇష్టం వారితో మీ సంబంధాలు ఎలా ఉంటాయని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు సమాధానంగా నాకు సమంత అంటే చాలా ఇష్టం. ఆమె ఒక పవర్ ఫుల్ ఉమెన్ అంటూ కితాబిచ్చింది. ఆమెతో నేను చాలా స్నేహంగా ఉంటానంది.

ఇటీవలే మన్మధుడు 2 పోర్చుగల్ షెడ్యూల్ ను ముగించుకుంది. త్వరలోనే హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ ను జరుపుకోబోతుంది. నాగార్జున మరియు దర్శకుడు రాహుల్ పై రకుల్ ప్రశంసలు కురిపించింది. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈమె నటిస్తోంది. ఈనెల 31న ఈమె సూర్యతో నటించిన ఎన్జీకే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. మన్మధుడు 2 చిత్రం కూడా తప్పకుండా మరోసారి టాలీవుడ్ లో తనకు ఛాన్స్ లు వచ్చేలా చేస్తుందనే నమ్మకంతో రకుల్ ఉంది.