రకుల్ నెక్ట్స్ టార్గెట్ క్రీడా వ్యాపారం

Sun Sep 15 2019 11:19:51 GMT+0530 (IST)

Rakul Preet Singh Enters Into New Business

దీపం ఉండగానే చక్కదిద్దుకోవడంలో మన కథానాయికల తర్వాతే. ప్లానింగ్ లో ది బెస్ట్ గా దూసుకుపోయే నాయికల్లో పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ పేరు ప్రథమ వరుసలో ఉంటుంది. ఇప్పటికే ఈ అమ్మడు ఎఫ్ 45 పేరుతో ఇప్పటికే జిమ్ వ్యాపారంలో రాణించిన రకుల్ తదుపరి మరో క్రేజీ బిజినెస్ పై దృష్టి సారించడం హాట్ టాపిక్ గా మారింది.కథానాయికగా క్రేజు తగ్గక ముందే అమ్మడు సరైన ప్లానింగ్ లో ఉందిప్పుడు. ఇటీవల కెరీర్ పరంగా ఏదో తేడా కొడుతోంది. మొన్నటికి మొన్న `మన్మథుడు-2` ఆశించిన హిట్టివ్వకపోవడం ఈ అమ్మడికి మైనస్ గా మారింది. మునుముందు సీనెలా ఉంటుందో? అందుకే ఈ విషయాన్ని గ్రహించిన రకుల్ తన టార్గెట్‌ని బాలీవుడ్ కు షిఫ్ట్ చేసేసింది. `దే దే ప్యార్ దే` సినిమాతో బాలీవుడ్‌లో తొలి విజయాన్ని సొంతం చేసుకున్న రకుల్ బాలీవుడ్ లో భారీ చిత్రాలపై కన్నేసింది. ఇదిలా వుంటే ఓ పక్క హీరోయిన్‌గా తెలుగు- తమిళ- హిందీ భాషల్లో బిజీగా వుంటూనే ఫిట్ నెస్ పేరుతో కొత్త ప్లాట్ ఫామ్ ను కొత్త బిజినెస్ ని ఏర్పాటు చేసుకున్న రకుల్ తాజాగా కొత్త బిజినెస్ ని ఎంచుకున్నట్టు తెలిసింది. దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకున్నట్టుగా హీరోయిన్‌గా క్రేజ్ వుండగానే ఆ క్రేజ్‌ని ఉపయోగించుకుంటూ కొత్త వ్యాపారం మొదలుపెడుతోంది.

ఇదివరకూ ఎఫ్ 45  ఫిట్ నెస్ సెంటర్లని ప్రారంభించిన రకుల్ హైదరాబాద్‌లో రెండు బ్రాంచీలతో పాటు.. వైజాగ్ లోనూ ఓ బ్రాంచీని ఏర్పాటు చేసింది. ఫిట్ నెస్ రంగంలో సక్సెస్ సాధించిన రకుల్ స్పోర్ట్స్ బిజినెస్ లోకి ఎంటరవుతోంది. తాజాగా టెన్నిస్ క్రీడకు ఉన్న క్రేజు దృష్ట్యా .. ఈ తరహా ప్రీమియర్ లీగ్ లు ఆడించే ఓ క్లబ్ ని కొనుగోలు చేసిన రకుల్ హైదరాబాద్ స్ట్రైకర్స్ టీమ్ కి ఓ భాగస్వామిగా వ్యవహరించబోతోంది. ఈ టీమ్ లో అండర్ 14.. అండర్ 18 కేటగిరీ ప్లేయర్స్ వుంటారు. త్వరలో ఈ ప్లేయర్లతో యాన్యువల్ టోర్నమెంట్స్ ని ప్రారంభించబోతున్నారు. సినీ కెరీర్ ఎండ్ అయ్యాక సీనియర్లు  ప్రీతీ జింటా.. శిల్పాశెట్టీ ఐపీఎల్ లోకి ఎంటరైన విషయం తెలిసిందే. ఇప్పుడు తెలివైన రకుల్ కూడా వారిని అనుసరిస్తోందనే భావించాల్సి ఉంటుంది.