ముంబై వీధుల్లో ఫిట్నెస్ ఫ్రీక్ సైక్లింగ్ చూశారా?

Sat Oct 31 2020 22:30:23 GMT+0530 (IST)

Have you seen fitness freak cycling on the streets of Mumbai?

అథ్లెట్ కం సైక్లిస్ట్ అనగానే తొలిగా నేహా శర్మ సోదరి ఐషా శర్మ గుర్తుకు వస్తుంది. ఈ అమ్మడు రన్నింగ్ సైకిల్ పైనే యోగా ఫీట్స్ వేస్తూ అభిమానులకు షాకులిస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు ఇటీవల అంతర్జాలంలో జోరుగా వైరల్ అయ్యాయి. ఇక లేటెస్టుగా రకుల్ ప్రీత్ వంతు.స్వతహాగానే ఫిట్నెస్ ఫ్రీక్ అయిన రకుల్ ఓవైపు జిమ్ ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. యోగాసనాలకు పర్ఫెక్ట్ గా సమయం కేటాయిస్తుంది. అయితే కేవలం ఇవి మాత్రమే సరిపోవడం లేదు తన స్టామినాకి. అందుకే ఇదిగో ఇలా వీలున్నప్పుడల్లా ఆల్టర్నేట్ ఎక్సర్ సైజుల్ని ప్లాన్ చేస్తోంది. సందర్భాన్ని బట్టి ముంబై వీధుల్లో సైక్లింగ్ చేస్తూ వ్యాయామాన్ని కొనసాగిస్తోంది. నిజానికి శరీరంలో ఏ పార్ట్ కి ఏ ఎక్సర్ సైజ్ చేయాలో ఫిట్నెస్ కోచ్ చెబుతుంటారు. దానిని రకుల్ ఫాలో చేస్తోందన్నమాట.

సైక్లింగ్ అనేది అన్నివిధాలా ఆరోగ్యకరం. వాకింగ్ జాగింగ్ వంటివి కుదరనప్పుడు కనీసం సైక్లింగ్ చేసినా ప్రయోజనకరమే. తాజాగా ముంబైలో రకుల్ బ్లాక్ అథ్లెటిక్ డ్రెస్ ని ధరించి సైక్లింగ్ కి వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అన్నట్టు ఓవైపు క్రిష్ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ లో ఉన్న రకుల్ ఇంతలోనే షెడ్యూల్ ముగించి ముంబై కి ఎప్పుడు వెళ్లిందో కానీ అస్సలు ఏమాత్రం రాజీ అన్నదే లేకుండా ఫిట్నెస్ పై దృష్టి సారిస్తోంది. షేపవుట్ అయిపోయేందుకు ఎంతమాత్రం సిద్ధంగా లేదు. క్రిష్ మూవీతో పాటు శంకర్ దర్శకత్వంలో భారతీయుడు 2 మూవీ చేస్తోంది. అలాగే అర్జున్ కపూర్ తో ఓ సినిమా చేస్తోంది.