ఇది మోసం కదా రకుల్ పాపా!

Tue Jun 12 2018 11:41:55 GMT+0530 (IST)

టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తన కెరీర్ ను బాలీవుడ్ లో మొదలుపెట్టినా.. ఆమెకు కెరీర్ ఇచ్చినది టాలీవుడ్ మాత్రమే. దాదాపు టాప్ హీరోయిన్ స్టేటస్ కు వెళ్లిపోయి.. ఒకేసారి ముగ్గురు స్టార్ హీరోలతో అవకాశాలను దక్కించుకుని ఆశ్చర్యపరిచిన రికార్డు ఉంది.ఇప్పుడు కాసింత స్లో అయిన మాట వాస్తవమే అయినా.. బ్యూటీ రకుల్ కి డిమాండ్ ఇంకా బాగానే ఉంది. అయితే.. ఈ సమయంలో రకుల్ ప్రీత్ కు బాలీవుడ్ నుంచి పిలుపులు అందుతున్నాయి. పలు ఈవెంట్స్ కు కూడా అటెండ్ అవుతోంది. రీసెంట్ గా డీప్ నెక్ క్లీవేజ్ చేస్తూ బాగా షాక్ ఇచ్చింది రకుల్. ఇది టాలీవుడ్ నిర్మాతలను బాగా హర్ట్ చేసేసిందట. బాలీవుడ్ అవకాశాల కోసం గ్లామర్ ను బాగానే కురిపిస్తున్న రకుల్ పాప.. ఇక్కడ మాత్రం అల్ట్రా మోడర్న్ గ్లామర్ కు దూరం అని చెప్పడమే ఇందుకు కారణం.

రకుల్ కు గ్లామర్ డాల్ గానే ఇమేజ్ ఉంది కానీ.. తన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ అంటూ రకరకాల పేర్లు చెప్పి కొన్ని పరిమితుల వరకే ఇక్కడ ఎక్స్ పోజింగ్ చేసింది. కానీ ఈ భామను పెంచి పోషించిన టాలీవుడ్ సినిమాలకు.. ప్రేక్షకులకు చూపించకుండా దాచేసుకున్న అందాలను.. స్పెషల్ గా బాలీవుడ్ లోనే చూపించేయడం మాత్రం టాలీవుడ్ నిర్మాతలనే కాదు.. తెలుగు ప్రేక్షకులను కూడా హర్ట్ చేస్తోంది. ఇలా చేయడం తమను మోసం చేయడమే అని ఫీలయిపోతున్నారు కూడా.