Begin typing your search above and press return to search.

పీకే అమీర్ స్ఫూర్తితో ఏలియ‌న్ గా ర‌కుల్!

By:  Tupaki Desk   |   9 Aug 2020 4:00 AM GMT
పీకే అమీర్ స్ఫూర్తితో ఏలియ‌న్ గా ర‌కుల్!
X
గ‌త కొంత‌కాలంగా పంజాబీ బ్యూటీ ర‌కుల్ ప్రీత్ కెరీర్ డైల‌మాలో ప‌డిందంటూ వ‌రుస క‌థ‌నాలు వేడెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌న్మ‌థుడు 2 త‌ర్వాత ఈ అమ్మడికి తెలుగులో అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో ఇక ఇక్క‌డ దుకాణం స‌ర్ధేసిన‌ట్టేనంటూ ప్ర‌చార‌మైంది. కానీ ఇటీవ‌ల ర‌కుల్ ఆలోచ‌న ధోర‌ణి మారింద‌ట‌. ప్లాన్ బిలో తెలివైన ఎంపిక‌ల‌తో ముందుకెళుతోంది. ఇటీవ‌ల‌ సీనియ‌ర్ హీరోల స‌ర‌స‌న న‌టించేందుకు ఈ అమ్మ‌డు ఆస‌క్తిగా ఉంద‌ని ఆ క్ర‌మంలోనే చిరంజీవి.. బాల‌య్య లాంటి సీనియ‌ర్లు త‌దుప‌రి ప్రాజెక్టుల‌కు ర‌కుల్ పేరును ప‌రిశీలిస్తున్నార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది.

అలాగే బ‌యోపిక్ కథాంశాల్ని ప‌రిశీలిస్తోంద‌ట‌. ఒలింపిక్ ప‌థ‌క గ్ర‌హీత‌ క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి బ‌యోపిక్ లో న‌టించేందుకు ర‌కుల్ స‌న్న‌ద్ధ‌మ‌వుతోంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. మ‌రోవైపు ర‌కుల్ ఓ భారీ ప్ర‌యోగానికి శ్రీ‌కారం చుట్టింద‌ట‌. తాను ఎంపిక చేసుకున్న ఆ రోల్ లో అర్థ‌న‌గ్నంగా క‌నిపించే వీలుంద‌ని తెలుస్తోంది.

ఇంత‌కీ ఏ సినిమాలో అంటే.. ఓ ద్విభాషా చిత్రంలో ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ట‌. పీకే సినిమాలో అమీర్ ఖాన్ స్ఫూర్తి తో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఏలియ‌న్‌ గా నటిస్తోంద‌‌ని తెలుస్తోంది. ఇందుకోసం రకుల్ సెమీ న్యూడ్ గా కనిపించబోతుంద‌ట‌. తమిళ్ - తెలుగు భాషల్లో రెడీ అవుతున్న ఈ సినిమాలో రకుల్ గ్లామర్ షో ఓ రేంజ్ లో ఉండబోతుంద‌ని స‌మాచారం.