Begin typing your search above and press return to search.

వరుసగా అవే చేసి తప్పు చేశాను!

By:  Tupaki Desk   |   24 Feb 2020 1:30 AM GMT
వరుసగా అవే చేసి తప్పు చేశాను!
X
ఉవ్వెత్తున ఎగిరిన కెరటంలా రకుల్‌ కెరీర్‌ టాలీవుడ్‌ లో ఓ రేంజ్‌ లో పైకి వెళ్లింది. కాని అనూహ్యంగా అతి తక్కువ సమయంలోనే ఆమె డౌన్‌ ఫాల్‌ మొదలైంది. ప్రస్తుతం ఆమె సినిమాలు చేస్తుందా లేదో కూడా తెలియడం లేదు. వరుసగా కమర్షియల్‌ పాత్రలు చేసి భారీ విజయాలను అందుకున్నా కూడా రకుల్‌ కు మాత్రం ప్రస్తుతం సినిమాల్లో ఛాన్స్‌ లు రావడం లేదు. ఈ అమ్మడు తాజాగా ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ తన కెరీర్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

తనకు వచ్చిన ఆఫర్లన్నీ కూడా కమర్షియల్‌ ఆఫర్లే అని.. వాటిని కాదనలేక పోయాను. అయితే వరుసగా గ్లామర్‌ పాత్రలు చేయడం వల్ల నా కెరీర్‌ పై ప్రభావం పడినది. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు లేదంటే లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలను కూడా చేసి ఉంటే తాను ఇంకొంత కాలం స్టార్‌ హీరోయిన్‌ గా ఉండేదాన్ని అన్నట్లుగా ఆమె చెప్పుకొచ్చింది. వరుసగా స్కిన్‌ షో పాత్రలు మాత్రమే చేసి తప్పు చేశానంటూ రకుల్‌ పేర్కొంది.

నిజంగానే రకుల్‌ వరుసగా అలాంటి పాత్రలు చేయడం వల్ల ఆమె కెరీర్‌ చాలా త్వరగా ముగింపు దశకు చేరుకుంది. తప్పు తెలుసుకున్న రకుల్‌ కు దాన్ని సరిదిద్దుకునే ఛాన్స్‌ లేదు. ఆమె కెరీర్‌ ఏదైనా అద్బుతం జరిగితే తప్ప మళ్లీ గాడిన పడటం అసాద్యం అంటు నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.