రకుల్ మార్నింగ్ రాగా.. అందమే యోగానాందం..!

Mon Jan 25 2021 13:43:24 GMT+0530 (IST)

Rakul Preet Latest Stunning Pose

టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా కంటిన్యూ అవుతున్న రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్ నెస్ గురించి అందరికీ తెలిసిందే. ఎక్కడ ఉన్నా.. ఎలా ఉన్నా.. మార్నింగ్ కసరత్తులు మాత్రం ఆపేది లేదంటుంది. కరోనా బారిన పడిన టైంలోనూ డాక్టర్స్ ప్రిస్కిప్షన్స్ యూజ్ చేస్తూనే.. నెగెటివ్ రిపోర్ట్ కొట్టేదాకా  నాన్ స్టాప్ గా ఫిట్ నెస్ మంత్రం జపించింది. చివరకు సక్సెస్ సాధించి మళ్లీ సెట్స్ లో అడుగు పెట్టింది రకుల్.అయితే.. సౌత్ లో సత్తా చాటిన ఈ భామ.. నార్త్ లో పాగావేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉంది. గతంలో పలు సినిమాలు కూడా చేసినప్పటికీ.. ఆశించిన గుర్తింపు రాలేదు. దీంతో.. మళ్లీ ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం అజయ్ దేవ్ గన్ సరసన ‘మేడే’ చిత్రంలో నటిస్తోంది. ఇంద్ర కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘థాంక్ గాడ్’ మూవీలోనూ నటిస్తోంది ఈ బ్యూటీ. ఇందులో అజయ్ దేవగన్ సిద్దార్థ్ మల్హోత్రా హీరోలుగా నటిస్తున్నారు.

కాగా.. ఈ సెండే ‘థాంక్ గాడ్’ సెట్ లో అడుగుపెట్టిన రకుల్.. తన ఎంట్రీకి సంబంధించిన పలు పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన మొదటి రోజు వర్క్ ఎలా ఉందో ఫ్యాన్స్ తో పంచుకుందీ బ్యూటీ. ‘కొత్త చిత్రానికి ముందు హ్యాపీ ఫేస్’ అంటూ ఓ చిత్రాన్ని మేకప్ వేసుకుంటున్న మరో ఫొటోను షేర్ చేసింది. ఆ తర్వాత ఒక వీడియోను కూడా షేర్ చేసింది. #Morningmadness అనే హ్యాష్‌ట్యాగ్‌తో పోస్ట్ చేసిన ఈ క్లిప్.. ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది.

అయితే.. లేటెస్ట్ గా ‘పింక్ విల్లా సౌత్’ నుంచి మరో ఫొటోను షేర్ అయ్యింది. మండే మార్నింగ్ ఫిట్ నెస్ సెషన్ కు వెళ్తున్న రకుల్ కేక పెట్టిస్తోంది. ఎన్-90 మాస్క్ ధరించిన బ్యూటీ.. యాష్ కలర్ ఫిట్ నెస్ డ్రెస్ లో మార్నింగ్ యోగాకు సిద్ధమైంది. ఈ ఫొటో అభిమానులను అలరిస్తోంది.