కూల్ గా రిలాక్స్ డ్ గా మర్డర్ చేస్తోంది!

Fri Dec 04 2020 14:33:18 GMT+0530 (IST)

Rakul Preet Latest Stunning Pose

కూల్ గా రిలాక్స్ డ్ గా అలా చైర్ లో వాలిపోయింది. అంతేనా క్రీగంటి చూపుతో కుర్రకారు గుండెల్ని కోసేస్తోంది. అసలింతకీ రకుల్ కి ఏమైంది. కూల్ నెస్ తో కూడుకున్న మ్యాడ్ నెస్ ని కుర్రాళ్లకు పరిచయం చేస్తోంది.మొన్ననే క్రిష్ మూవీ చిత్రీకరణను పూర్తి చేసింది. ఇకపై భారతీయుడు 2 చిత్రీకరణ కోసం వెయిట్ చేస్తోంది. దీంతో పాటు అటు హిందీ తమిళ ప్రాజెక్టులపైనా కసరత్తు చేస్తోందట. ఆ క్రమంలోనే కథలు వింటోంది. వీలున్నప్పుడల్లా స్ట్రెస్ రిలీఫ్ కోసం రకుల్ ఎంచుకుంటున్న పద్ధతి ఆసక్తిని రేకెత్తిస్తోంది.

రకుల్ ఇటీవల కూల్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యి వరుస ఫోటోషూట్లతో వేడి పెంచేసింది. లేటెస్ట్ గా ఆ చైర్ లో అలా రిలాక్సవుతూ ఉన్న ఈ భామ ఫోటో రిలీజైంది. రకుల్ కిల్లింగ్ లుక్ తో కట్టి పడేస్తోంది. ఏదో ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తున్నా.. ఆ  ఫ్రీ హెయిర్ స్టైల్ అదనపు ఆకర్షణగా మారింది. ఇంతకీ ఇది సెట్స్ లోనా.. లేక డిజైనర్ ఫక్షటోషూట్ నా ?అన్నదానికి రకుల్ సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.