Begin typing your search above and press return to search.

మన్మథుడి జోడీ.. యమా హాట్ గా ఉందే

By:  Tupaki Desk   |   16 July 2019 12:43 PM GMT
మన్మథుడి జోడీ.. యమా హాట్ గా ఉందే
X
బ్యూటిఫుల్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం అక్కినేని నాగార్జున తాజా చిత్రం 'మన్మథుడు 2' లో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈమధ్యే రిలేజ్ అయిన 'మన్మథుడు 2' టీజర్ లో రకుల్ పాత్ర బోల్డ్ నెస్ అందరికీ ఓ షాకిచ్చింది. ఈ టీజర్ తోనే రకుల్ పాత్రకు ఈ సినిమాలో ఎంత ప్రాధాన్యత ఉందో అందరికీ తెలిసింది. తాజాగా ఈ సినిమాను నుండి ఓ కొత్త పోస్టర్ ను విడుదల చేశారు.

ఈ పోస్టర్ లో నాగార్జున - రకుల్ కబుర్లు చెప్పుకుంటూ ఓ ఫారెన్ లొకేషన్ లో నడుస్తూ ఉన్నారు. నాగార్జున హ్యాండ్సమ్ నెస్ గురించి కొత్తగా చెప్పేదేముంది.. ఫుల్ స్లీవ్స్ టీ షర్టులో ఫిట్ గా కనిపిస్తున్నాడు. ఇక రకుల్ మాత్రం తన గ్లామర్ తో తాట తీసేసింది. ఫ్రిల్స్ డిజైన్ ఉండే స్లీవ్ లెస్ టాప్.. డెనిమ్ షార్ట్ ధరించింది. ఆ షార్ట్ లెంగ్త్ ను కొలవాలంటే నానో టెక్నాలజీ మనకు అవసరం పడుతుంది. ఒక పుల్ ఓవర్ ను తన నడుముకు స్టైల్ గా కట్టుకుంది. అందులో కూడా ఎంత జాగ్రత్తపడిందంటే తన నాభి అందాలను ఎక్కడ ప్రేక్షకులు మిస్ అవుతారో పాపం.. అన్నట్టుగా నాభి అందాల వ్యూ కరెక్ట్ గా ఉండేలా కిందకు కట్టుకుంది. ఓవరాల్ గా అల్ట్రా స్టైలిష్ మోడల్ లాగా కనిపిస్తోంది. రకుల్ మన్మథుడికి తగ్గ జోడీనే.. ఏం అనుమానం లేదు. ఈ గ్లామర్ డోస్ సినిమాను మరింత స్పైసీగా మార్చడం ఖాయం.

ఈ సినిమాలో సమంతా.. అక్షర గౌడ.. కీర్తి సురేష్ క్యామియోలలో నటిస్తున్నారు. 'RX100' ఫేం చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ను ఆగష్టు 9 న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.