ఐడెంటిటీ కోసం పాకులాటా?

Thu Apr 18 2019 22:07:24 GMT+0530 (IST)

Raju Indukuri on Akashvani Movie

కంటెంటే కింగ్ అని ప్రూవ్ అవుతోంది. కొత్త ఐడియాతో నెగ్గుకు రాగలం అని నవతరం నిరూపిస్తున్నారు. మన దర్శకనిర్మాతల్లో అంతకంతకు మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఏదైనా కొత్తదనం కనిపించిన స్క్రిప్టును ఎంకరేజ్ చేసేందుకు ఏమాత్రం వెనకాడడం లేదు. కొత్త కుర్రాళ్లు కొత్తదనం ఉన్న కథల్ని చెబితే వెంటనే ఓకే చేస్తున్నారు. టాలీవుడ్ లో ఇదో కొత్త ఫేజ్ అనే చెప్పాలి. రకరకాల జానర్లను టచ్ చేసేందుకు అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఆ కోవలోనే ఇటీవల రిలీజైన మజిలీ.. రిలీజవుతున్న `జెర్సీ` సినిమాల గురించి వేడెక్కించే చర్చ సాగుతోంది. ఇక అదే బాటలో మరో కొత్త ప్రయత్నం చేస్తున్నారు  సతీష్ బత్తుల.ఈ యంగ్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న `ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం` అనే టైటిల్ ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తోంది. మల్లికార్జున్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శివ- ఉమయ జంటగా నటిస్తున్నారు. పేరెంట్ తో కొడుకు అనుబంధం నేపథ్యంలోని చిత్రమిదని తెలుస్తోంది. ఇటీవలే రిలీజైన టీజర్ ఆకట్టుకుంది. ఓ కుర్రాడు తన ఐడెంటిటీని నిరూపించుకునేందుకు చేసిన ప్రయత్నం ఎలాంటిది? అనే సింపుల్ కథాంశాన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తీర్చిదిద్దుతున్నారట. ఐడెంటిటీ మిస్ అయ్యింది! అనే కాన్సెప్ట్ టీజర్ ఇప్పటికే ఆకట్టుకుంది. టీజర్ చూసి వెంటనే ఇందులో కథాంశాన్ని గెస్ చేయలేరు. తల్లిదండ్రులు.. కొడుకు మధ్య అనుబంధానికి సంబంధించిన కథ హైలైట్ గా ఉంటుందని చెబుతున్నారు.

మొత్తానికి  టైటిల్ ఆకట్టుకుంది. ప్రయత్నం బావుంది. అప్పట్లో వచ్చిన నేపోలియన్ - కంచరపాలెం చిత్రాలు కొత్తదనం నిండిన కంటెంట్ తో ఆకట్టుకున్నాయి. కంచరపాలెం చిత్రానికి రానా లాంటి స్టార్ హీరో సపోర్ట్ చేశారు. `ఆకాశవాణి విశాఖ పట్నం కేంద్రం` చిత్రానికి రాజ్ కందుకూరి లాంటి నిర్మాత బ్యాకప్ ఉందని తెలుస్తోంది. మొత్తానికి ఇలాంటి మరిన్ని ప్రయత్నాలతో యువతరం ముందుకు రావాలనే ఆకాంక్షిద్దాం.