ఒకే స్టేజ్ పై ఇద్దరు సూపర్ స్టార్స్

Sat Aug 13 2022 11:41:33 GMT+0530 (IST)

Rajnikanth KamalHassan Combo Again

తమిళ సూపర్ స్టార్స్ రజినీకాంత్ మరియు కమల్ హాసన్ లు అతి త్వరలో ఒకే స్టేజ్ పై సందడి చేయబోతున్నారు. వీరిద్దరు కలిసి స్టేజ్ షేర్ చేసుకోవడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. తమిళ సినీ అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా వీరిద్దరు కలిసి ఒకే స్టేజ్ పై కనిపిస్తే బాగుండు అనుకుంటూ ఉన్నారు. మణిరత్నం సినిమా కోసం వీరిద్దరి స్టేజ్ షేర్ చేసుకోబోతున్నారు.మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ ఆడియో విడుదల కార్యక్రమంకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ ఆడియో విడుదల కార్యక్రమంలో వీరిద్దరు పాల్గొనేందుకు గాను ఓకే చెప్పారని తెలుస్తోంది. కేవలం వీరిద్దరు స్టార్స్ మాత్రమే కాకుండా సినిమా లో నటించిన హేమా హేమీలు కూడా ఈ ఆడియో విడుదల కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

హీరోయిన్ ఐశ్వర్య రాయ్ తో పాటు త్రిష ఇంకా పలువురు నటీ నటులు ఈ సినిమాలో నటించారు. వారందరితో పాటు కమల్ మరియు రజినీకాంత్ లు కూడా హాజరు అవ్వబోతున్న నేపథ్యంలో ఆ కార్యక్రమం ఒక కన్నుల పండుగ అన్నట్లుగా వేడుక గా జరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఆ మధ్య విక్రమ్ సినిమా సక్సెస్ సందర్బంగా రజినీకాంత్ మరియు కమల్ లు కలిసిన విషయం తెల్సిందే. మళ్లీ ఆడియో విడుదల కార్యక్రమం కోసం వీరిద్దరు కలువబోతున్నారు.

ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మరింతగా పబ్లిసిటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

మణిరత్నం ఈ సినిమాను విజువల్ వండర్ గా రూపొందించాడు అంటూ యూనిట్ సభ్యులు అంటున్నారు. భారీ మల్టీ స్టారర్ గా రూపొందిన ఈ సినిమా కు సంబంధించిన మొదటి పార్ట్ ను సెప్టెంబర్ 30వ తారీకున ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. భారీ ఎత్తున పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ను డబ్ చేసి విడుదల చేయబోతున్నారు అంటున్నారు.