Begin typing your search above and press return to search.

ఆ విషయం సూపర్ స్టార్ చెవిన పడలేదా..?

By:  Tupaki Desk   |   4 Aug 2020 10:10 AM GMT
ఆ విషయం సూపర్ స్టార్ చెవిన పడలేదా..?
X
ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారి పేరు వింటేనే గజగజ వణికిపోతుంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇపుడు దేశా విదేశాలన్నింటిని చుట్టేస్తోంది. ఇప్పటికే ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నాం చేస్తోంది. దీంతో అప్రమత్తమైన జనం పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొంతకాలంగా మన దేశంలో లాక్‌డౌన్ సడలింపులు అమలులో ఉన్నాయి. ఈ మహమ్మారి దెబ్బకు బీదా.. గొప్ప.. ఆడా.. మగా తేడా లేకుండా అందరు ఆసుపత్రి పాలవుతున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో దాదాపు అన్నీ పరిశ్రమలతో పాటు సినీ పరిశ్రమలు కూడా స్థంభించిపోయాయి. ఈ వైరస్ ధాటికి సమస్తం షూటింగ్స్ సహా సమస్తం బంద్ అయ్యాయి. ప్రభుత్వాలు అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఇచ్చారు. ఈ ఎఫెక్ట్ కారణంగా పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఇంటికే పరిమితమయ్యారు. అయితే చెన్నైలో ప్రస్తుతం ఐదు జిల్లాలు సంపూర్ణ లాక్ డౌన్ విధించుకున్నాయి. ఎవరికీ ఏది అవసరం అయినా ఈ పాస్ తీసుకోవాలని రూల్ పెట్టింది ప్రభుత్వం.

ఈ క్రమంలో సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా లాక్ డౌన్లో ప్రస్తుతం ఇంటి పట్టునే ఉంటున్నాడు. దాదాపు నాలుగు నెలల నుండి సూపర్ స్టార్ ఎలాంటి సినిమాలు.. షూటింగ్స్ లేక తన కుటుంబ సభ్యులతో ఉంటున్నాడు. ప్రస్తుతం అన్నతే సినిమాలో నటిస్తున్నాడు రజినీ. ఆయన ఇప్పుడైతే చెన్నై శివారులోని కేలంబాక్కం ఫామ్ హౌస్ లో ఉంటున్నారట. ఇటీవలే కేలంబాక్కంలో రజినీ ఓ లగ్జరీ కారులో తిరిగారట. అయితే మరి రజినికి ఈ పాస్ ఉందా అంటూ నెటిజన్లు అడుగుతున్నారు. ఆయన ఈ పాస్ తీసుకొనే ప్రయాణించాడని సన్నిహితులు చెప్పారట. ఇదిలా ఉండగా మరో ట్వీట్లో రజినీ క్షమాపణలు చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఆ అకౌంట్ రజినీది కాదని నేషనల్ మీడియా తెలిపింది. రజనీ అధికారిక ట్విట్టర్ ఖాతా 2013లో ‘@rajinikanth’ పేరుతో ఓపెన్ చేసాడు. అయితే ఫేక్ అకౌంట్ '@RajiniOff’ పేరుతో నెల ముందు ఓపెన్ చేసినట్లు తెలిపింది. అయితే ఈ విషయం రజిని చెవిన పడిందా లేదా..? తెలియాల్సి ఉంది. అలాగే రజినీ స్పందన ఏంటో చూడాలి!