రజినీకాంత్ మనసు మార్చుకున్నాడా?

Tue Aug 11 2020 20:07:23 GMT+0530 (IST)

Has Rajinikanth changed his mind?

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. కీర్తి సురేష్ నయనతార ఖుష్బు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ సగంలో ఆగిపోయింది. కరోనా కారణంగా సినిమా షూటింగ్ నిలిచి పోవడంతో బడ్జెట్ భారీగా పెరిగి పోతుందని మేకర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో 2020 మొత్తం కూడా తాను కెమెరా ముందుకు రాను అంటూ కొన్ని రోజుల క్రితం రజినీకాంత్ తేల్చి చెప్పాడట. కాని తాజాగా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నాడనే టాక్ తమిళ సినీ వర్గాల్లో వినిపిస్తుంది.సినిమాను పూర్తి చేసే ఉద్దేశ్యంతో రజినీకాంత్ డేట్లు ఇచ్చేందుకు సిద్దం అయ్యారు. నవంబర్ లో షూటింగ్ కు వెళ్లేందుకు రజినీకాంత్ ఓకే చెప్పారట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమాను కేవలం 50 మంది నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల సమక్షంలో చిత్రీకరించబోతున్నారట. అది కూడా అత్యంత కట్టుదిట్టమైన జాగ్రత్తల మద్య షూటింగ్ చేయబోతున్నారట.

రజినీకాంత్ వయసు 60 ఏళ్లు దాటి పోయింది కనుక ఆయన ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. అందుకే శివ ప్రత్యేకమైన చర్యలు తీసుకుని సినిమాను పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట. త్వరలో సినిమా షూటింగ్ కు సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.