తలైవర్ ఎనర్జీనే వేరబ్బా..

Wed Apr 24 2019 11:53:36 GMT+0530 (IST)

Rajinikanth Another Poster from Darbar Movie

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలంటే ఫ్యాన్స్ కు అదో పండగ వచ్చినట్టు ఉంటుంది.  ఈమధ్య తెలుగులో కాస్త జోరుతగ్గినా తమిళంలో మాత్రం రజనీ సినిమాలు మళ్ళీ పుంజుకున్నాయి.  రజనీ లాస్ట్ సినిమా 'పేట' మంచి కలెక్షన్స్ వసూలు చేసి రజనీ ఇమేజ్ కు వచ్చిన ఇబ్బందేమీ లేదని ఋజువు చేసింది.  ఇక సూపర్ స్టార్ తన కొత్త సినిమా 'దర్బార్' షూటింగ్ లో బిజీగా ఉన్నారు.ఈ సినిమాకు టాలెంటెడ్ ఫిలిం మేకర్ ఎఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఆది కాకుండా రీసెంట్ గా కొన్ని ఆన్ లోకేషన్స్ పిక్స్ కూడా లీక్ అయ్యాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే.. రజనీ వీరాభిమాని ఒకరు 'దర్బార్' పోస్టర్ ను డిజైన్ చేయగా అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు పోస్టర్ ఎలా ఉందంటే 'దర్బార్' ఒరిజినల్ పోస్టర్ కంటే వెయ్యి రెట్లు బెటర్ గా ఉంది. ఇక ఈ పోస్టర్ లో రజనీ స్టైల్.. ఆ యాటిట్యూడ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పోలీస్ యూనిఫాం లో ఉన్న రజనీ స్టైల్ గా చేత్తో కూలింగ్ క్లాసెస్ ధరించే పోజ్ ఇది. ఈ ఫోటో చూసి తలైవర్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ సంతోషపడిపోతున్నారు.  

ఈ పోస్టర్ కు లభించిన అద్భుత స్పందన చూసి థ్రిల్లయిన అభిమాని ఆ పోస్టర్ కు 3డీ వెర్షన్ కూడా రిలీజ్ చేస్తానని అంటున్నాడు.  ఆ మురుగదాస్ ఈ సినిమాకు సంబంధించిన నెక్స్ట్ పోస్టర్ల రిలీజ్ కు ఈ వీరాభిమాని సహాయం తీసుకోవడం మేలేమోనని కొంతమంది నెటిజనులు కామెంట్ చేస్తున్నారు.