రజనీ డైరెక్టర్ సరికొత్త ప్రయోగం

Thu Jul 07 2022 12:00:01 GMT+0530 (IST)

Rajini Director New Movie Update

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కబాలి కాలా వంటి యాక్షన్ ఎంటర్ టైనర్ లని అందించి దర్శకుడు పాపులారిటీని సొంతం చేసుకున్నారు పా. రంజిత్. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాల సాధించలేకపోయినా రజనీతో చేసిన సినిమాలు కాబట్టి దర్శకుడిగా పా. రంజిత్ కు ఇవి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టాయి.ఇక రీసెంట్ గా పీరియాడికల్ మూవీగా చేసిన బాక్సాంగ్ డ్రామా 'సర్పట్ట' కరోనా కారణంగా నేరుగా ఓటీటీలో విడుదలై మంచి విజయాన్ని సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసల్ని అందించింది.

ఈ మూవీ తరువాత పా. రంజిత్ ఓ కొత్త తరహా ప్రేమకథకు శ్రీకారం చుట్టారు. తను తమిళ ఇండస్ట్రీలోకి ప్రవేశించి పదేళ్లు అవుతున్న సందర్భంగా సరికొత్త ప్రేమకథతో ప్రయోగానికి రెడీ అయిపోయారు. పా. రంజిత్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'నశ్చత్తిరం నగర్ గిరాదు'.

కాళిదాసు జయరామ్ దుషారా విజయన్ జంటగా నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

ఈ పోస్టర్ కు లవ్ ఈజ్ పొలిటికల్' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. హీరోయిన్ దుషారా ఫొటోని వెరైటీగా డిజైన్ చేయించి మిగతా పాత్రలని ఆమె చుట్టూ చేర్చి థీమ్ పోస్టర్ ని విడుదల చేసిన తీరు ఆకట్టుకుంటోంది. పోస్టర్ థీమ్ ని చూస్తుంటే సినిమా అంటూ హీరోయిన్ దుషారా చుట్టూ తిరిగే కాన్సెప్ట్ నేపథ్యంలో ఈ మూవీ సాగుతుందని స్పష్టమవుతోంది.

ఇందులో దుషారాతో పాటు కాళిదాస్ జయరామ్ కలైయరసన్ షబీర్ హరికృష్ణన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ రొమాంటిక్ డ్రామాని నీలం ప్రొడక్షన్స్  యాజి ఫిలింస్ పై విఘ్నేష్ సుందరేశన్ మనోజ్ లియోనెల్  జాసన్ నిర్మిస్తున్నారు. తేన్మా సంగీతం అందించనున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే బయటికి రానున్నాయి.