Begin typing your search above and press return to search.

పండక్కి అందరూ పండగ చేసుకోబోతున్నారు

By:  Tupaki Desk   |   10 Dec 2019 12:00 PM GMT
పండక్కి అందరూ పండగ చేసుకోబోతున్నారు
X
సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఈమధ్య స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. సంక్రాంతికి విడుదల కానున్న సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా 'సరిలేరు నీకెవ్వరు' లో కూడా రాజేంద్ర ప్రసాద్ ఒక ముఖ్యపాత్ర పోషించారు. ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో 'సరిలేరు నీకెవ్వరు' గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు.

"మీరు సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఒక ప్రధాన పాత్ర పోషించారు కదా.. ఈ సినిమా ఎలా ఉండబోతోంది?" అని అడిగితే.. "సరిలేరు నీకెవ్వరు సినిమాకు సరిలేదు. పండక్కి అందరూ డెఫినిట్ గా పండగ చేసుకోబోతున్నారు. ఈ సినిమా మహేష్ కెరీర్ లో కమర్షియల్ గా చాలా పెద్ద హిట్ కాబోతోంది. ఈ సినిమా మీ అంచనాలకు తగ్గకుండా ఉంటుందని నా నమ్మకం. నేను నా పాత్రకు సంబంధించిన డబ్బింగ్ కూడా చెప్పాను. ఒక స్వీట్ తినకముందు ఇలా ఉంటుందని అనుకుంటాం. ఒక్కోసారి అది తిన్న తర్వాత అద్భుతం అనిపిస్తుంది. ఈ సినిమా అలాంటిదే" అంటూ చెప్పుకొచ్చారు నటకిరీటి.

"ఈ జెనరేషన్లో చాలామంది యువ దర్శకులు మీకు ప్రత్యేక పాత్రలు ఇస్తున్నారు. దీనికి కారణం ఏమంటారు?" అని అడిగితే.. "ఈ తరం దర్శకులలో చాలామంది చిన్నప్పుడు నా సినిమాలు చూస్తూ పెరిగినవారే. అందుకే నామీద వారు ప్రత్యేకమైన అభిమానం చూపిస్తూ ఉంటారు. ఈ తరం దర్శకులు నాపై ఇలా అభిమానం చూపించడం నా అదృష్టం" అంటూ సీక్రెట్ చెప్పారు.