Begin typing your search above and press return to search.

RRR టీజర్ .. లోడ్ చేసిన గ‌న్ లా..!

By:  Tupaki Desk   |   14 Oct 2021 3:30 PM GMT
RRR టీజర్ .. లోడ్ చేసిన గ‌న్ లా..!
X
జ‌క్క‌న్న లోడ్ చేసిన గన్ రెడీ చేశారు. గ‌న్ నుంచి బుల్లెట్టు దూసుకు రావ‌డ‌మే ఆల‌స్యం... వెబ్ యూట్యూబ్ లో సునామీ పోటెత్తుతుంది. రికార్డుల మోతెక్కిపోవ‌డం గ్యారెంటీ.

గత కొంత‌కాలంగా మోస్ట్ అవైటెడ్ ఆర్.ఆర్.ఆర్ టీజ‌ర్ గురించి ఇంత‌గా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. రాజమౌళి- రామ్ చరణ్ -జూనియర్ ఎన్టీఆర్ ఈ ముగ్గురి అభిమానుల్లో క్యూరియాసిటీని నిలువ‌రించ‌లేని ప‌రిస్థితి ఉంది. అందుకు త‌గ్గ‌ట్టే గుడ్ న్యూస్ ఒక‌టి ఫిలింస‌ర్కిల్స్ లో వైర‌ల్ అవుతోంది. RRR కొత్త టీజర్ రెడీ అవుతోంది. త్వరలో ఆవిష్కరించేందుకు టీమ్ రెడీ అవుతోంది. ఈ దీపావళికి టీజ‌ర్ విడుదల కానుందనేది ఈ గుస‌గుస‌ల సారాంశం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందిట‌.

దీపావళికి టీమ్ ఆర్‌.ఆర్.ఆర్ సినిమా టీజర్ ను ఆవిష్కరిస్తే ఈ పండుగ సీజన్ లో అభిమానులకు స‌ర్ ప్రైజింగ్ కానుకగా అల‌రిస్తుంద‌ని చెప్పాలి. ఈ ఊహాగానాలు నిజమవుతాయో లేదో వేచి చూడాలి. ఆర్.ఆర్.ఆర్ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రిలో విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే.

ప్ర‌చారం మునుపెన్న‌డూ లేని రేంజులో

ఆర్.ఆర్.ఆర్ జాతీయ స్థాయిలో మోస్ట్ అవైటెడ్ మూవీగా పాపుల‌రైన సంగ‌తి తెలిసిందే. తెలుగు-హిందీ- త‌మిళం స‌హా ప‌లు భాష‌ల్లో ఈ చిత్రం అత్యంత భారీగా రిలీజ్ కానుంది. జ‌న‌వ‌రిలో సంక్రాంతి కానుక‌గా ఈ చిత్రం విడుద‌ల‌వుతుంద‌ని జ‌క్క‌న్న బృందం వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం `రౌద్రం రణం రుధిరం` ప్ర‌మోష‌న్స్ లో వేగం పెంచేందుకు జ‌క్క‌న్న బృందం స‌న్నాహ‌కాల్లో ఉంది. మిగిలి ఉన్న‌ది కేవ‌లం రెండు నెల‌లు మాత్ర‌మే. ఈ రెండు నెల‌ల్లో అన్ని భాష‌ల్ని క‌వ‌ర్ చేస్తూ ప్ర‌చారం చేయాలి. అది కూడా అక్క‌డ స్థానిక భాష‌ల్లోనే చిత్ర‌బృందం ప్ర‌చారం నిర్వ‌హించాల‌ని ప్లాన్ చేస్తోంది. అంటే స్థానిక భాష‌ను నేర్చుకుని మ‌రీ బ‌రిలోకి దిగాల‌న్న‌ ప్లాన్ ని కూడా అమ‌ల్లోకి తేనున్నార‌ని తెలిసింది.

ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర ప‌నులు శ‌ర‌వేగంగా పూర్త‌వుతున్నాయి. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ ఆల్రెడీ తన పాత్రకి డబ్బింగ్ ని ప్రారంభించార‌ని తెలిసింది. ఇప్ప‌టికే ఆర్.ఆర్.ఆర్ కి అత్యంత భారీగా బిజినెస్ పూర్త‌యిన సంగ‌తి తెలిసిందే. అందుకే రిలీజ్ ముందే భారీగా హైప్ తేవాల‌న్న ప్లాన్ తో జ‌క్క‌న్న ఇక స్పీడ్ పెంచనున్నార‌ని తెలిసింది.

బిజినెస్ లోనూ దూకుడు

బాహుబ‌లి రిలీజ్ స‌మ‌యంలో ప్ర‌మోష‌న్స్ ఇన్ బిల్టెడ్ మ‌ర్కంటైల్ (టాయ్స్ త‌యారీ వ‌గైరా) బిజినెస్ మ‌రో లెవ‌ల్లో వ‌ర్క‌వుటైన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ కి ప్ర‌మోష‌న్ తో పాటు.. ఇదే బ్రాండ్ తో బిజినెస్ ని సైతం చేస్తున్నారు. ఇప్ప‌టికే ఓ వెబ్ సైట్ రానాతో లాంచ్ చేయించి అందులో కాస్ట్యూమ్స్ స‌హా కొన్ని ఆర్స్ట్ వ‌ర్స్క్ విక్ర‌యించ‌డం హాట్ టాపిక్ గా మారింది. త‌ద్వారా సినిమాకు కోట్లాది రూపాయ‌ల ప‌బ్లిసిటీ ఉచితంగా ల‌భించింది. అంత‌కు ముందు ఓ ప్ర‌మోష‌న‌ల్ సాంగ్ ని సైతం రిలీజ్ చేయగా వైర‌ల్ అయ్యింది.

అందులో సంగీత దర్శ‌కుడు కీర‌వాణి స‌హా మ‌రికొంత మంది సింగ‌ర్ల‌ను దోస్తీ సాంగ్ లో చూపించారు. ఈ పాట‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. సోష‌ల్ మీడియాలో బాగా పాపుల‌ర్ సాంగ్ గాను నిలిచింది. ఈ నేప‌థ్యంలో రాజ‌మౌళి మ‌రో ప్ర‌మోష‌నల్ సాంగ్ ని మార్కెట్ లోకి వ‌ద‌ల‌బోతున్నారు. ఈసారి సింగ‌ర్స్ కాకుండా నేరుగా సినిమాలో న‌టించిన న‌టీన‌టుల‌ను చూపించ‌బోతున్నారు. దాదాపు మెయిన్ పాత్ర‌ల్లో న‌టించిన వారంతా ఇందులో క‌నిపించ‌నున్నార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఎవ‌రెవ‌రు? ఎలాంటి పాత్ర‌లు పోషిస్తున్నారు? అన్న దానిపై ప్రేక్ష‌కాభిమానుల‌కు ఓ అంచ‌నా వుంది. ఈ నేప‌థ్యంలో ఈ వీడియో సినిమాకి మ‌రింత రీచ‌బిలిటీని పెంచుతుంద‌ని న‌మ్ముతున్నారు.