Begin typing your search above and press return to search.

తనవల్ల కాదని ముందే చేతులెత్తేసిన జక్కన్న

By:  Tupaki Desk   |   9 July 2020 11:50 AM GMT
తనవల్ల కాదని ముందే చేతులెత్తేసిన జక్కన్న
X
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఒక సినిమాను ప్రారంభించే సమయంలోనే మొత్తం ప్లానింగ్ చేసుకుంటాడు. కానీ ఆర్ ఆర్ ఆర్ సినిమా విషయంలో ఆయన ప్లానింగ్ అంతా తారుమారు అయ్యింది. ముందుగా అనుకున్న ప్రకారం అయితే ఇప్పటి వరకు ఆర్ ఆర్ ఆర్ సినిమా షూట్ పూర్తి అయ్యేది. కానీ కరోనా కారణంగా అంతా తారుమారు అయ్యింది. మూడు నెలల బ్రేక్ తర్వాత షూటింగ్స్ కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సీరియల్స్ తో పాటు కొన్ని సినిమాలు కూడా తక్కువ కాస్ట్ అండ్ క్రూ తో షూట్ ను చేస్తున్నారు. షూటింగ్ పర్మిషన్ కోసం సీఎం ల చుట్టూ తిరిగిన రాజమౌళి తన ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ను మొదలు పెట్టాలనుకున్నాడు.

మొదట స్టార్స్ లేకుండా గండిపేట లో టెస్ట్ షూట్ ప్లానింగ్ చేసిన రాజమౌళి మొదట పోలీసుల అనుమతి లేకపోవడంతో నిలిపేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కూడా షూటింగ్ మొదలు పెట్టలేదు. ఎప్పుడు కనీసం 150 నుండి 200 మంది షూటింగ్ స్పాట్ లో ఉంటే కానీ షూటింగ్ చేయలేని రాజమౌళి కేవలం 30 నుండి 50 మంది తో షూటింగ్ చేయడం అంటే కష్టం.

అందుకే మొదలు పెట్టకుండానే షూటింగ్ ను క్యాన్సల్ చేసుకున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాతే షూటింగ్ కు వెళ్లాలని.. ఆలస్యం అయినా పర్వాలేదు అనే నిర్ణయానికి జక్కన్న వచ్చినట్లుగా టాక్ వినిపిస్తుంది.