రాజమౌళి ఆ విషయంలో వెరీ స్ట్రిక్ట్

Wed Sep 11 2019 22:36:07 GMT+0530 (IST)

Rajamouli on about his Movies

'బాహుబలి' సిరీస్ లతో యావత్ ప్రపంచాన్ని తెలుగు సినిమావైపు చూసేలా చేసి ఇండియన్ సినిమా హిస్టరీలో నిలిచిన రాజమౌళి ప్రస్తుతం 'ఆర్.ఆర్.ఆర్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ - రామ్ చరణ్ కాంబినేషన్ లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా లీకుల విషయంలో ఎప్పటిలాగే జాగ్రత్త తీసుకుంటూ ముందుకెళ్తున్నాడు జక్కన్న. అందుకే షూటింగ్ స్టార్ట్ అయి నెలలు గడుస్తున్నా తారక్ - చరణ్ లుక్స్ పై ఎలాంటి లీకులు లేవు. ఇప్పటి వరకూ వీరిద్దరి గెటప్ తో షూటింగ్ స్పాట్ నుండి ఒక్క ఫోటో కూడా బయటికి రాలేదంటే జక్కన్న ఎంత కేర్ తీసుకుంటున్నాడో తెలిసిపోతుంది. బాహుబలి విషయంలోనూ ఇదే జాగ్రత్త తీసుకున్నాడు రాజమౌళి. అందుకే కర్నూల్ లో జరిగిన అవుట్ డోర్ షూట్ స్టిల్స్ తప్ప మిగతా స్టిల్స్ ఏవి రిలీజ్ కి ముందు బయటికి రాలేదు.అయితే లేటెస్ట్ గా 'ఆర్.ఆర్.ఆర్' షూటింగ్ లో మాత్రం ఒక వ్యక్తి సెల్ ఫోన్ తో కొన్ని ఫోటోస్ తీసే ప్రయత్నం చేసాడట. విషయం తెలుసుకున్న రాజమౌళి తనయుడు కార్తికేయ అక్కడిక్కడే ఆవ్యక్తి ఫోన్ ని నేలకేసి కొట్టాడని అంటున్నారు. వెంటనే ఆ వ్యక్తి సారీ చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడట. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరై ఉంటారు సినిమాకు పనిచేసే మనిషేనా లేదా బయటి నుండి వచ్చిన వాడా అనేది తెలియలేదు. నిజానికి షూటింగ్ స్పాట్ లో జరిగిన ఈ సంఘటన కూడా ఎలా బయటికి వచ్చిందో మరి.

అయితే లీకుల విషయంలో ఎప్పడూ స్ట్రిక్ట్ గానే ఉంటారు రాజమౌళి అండ్ టీం. ముఖ్యంగా ఆర్టిస్టులు  - టెక్నీషియన్స్ తప్ప మిగతా వారు షూటింగ్ సమయంలో మొబైల్స్ వాడకుండా చూసుకుంటారు. అలాగే మొబైల్ వాడే వారిపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టమని టీంకు ముందే చెప్తాడు జక్కన్న. అందుకే రాజమౌళి సినిమా నుండి ఫస్ట్ లుక్ వచ్చే వరకూ పెద్దగా లీకులు ఉండవు. లేటెస్ట్ గా జరిగిన ఈ సంఘటనే దీనికి ఉదాహరణ. ఇక లేటెస్ట్ గా అందిన సమాచారం మేరకూ 'ఆర్.ఆర్.ఆర్' లో తారక్ ఫస్ట్ లుక్ కొమరం భీమ జయంతి సందర్భంగా అక్టోబర్ లో రిలీజ్ చేస్తారట.