చరణ్ - తారక్ ఫ్యాన్స్ ను జక్కన్న ఆ విధంగా సంతృప్తి పర్చుతాడట

Thu Mar 14 2019 16:52:30 GMT+0530 (IST)

Rajamouli on about NTR And Ram Charan Fans

మల్టీస్టారర్ చిత్రాలు అంటే ఈమద్య కాలంలో చిన్న హీరో పెద్ద హీరో లేదంటే సీనియర్ హీరో సీనియర్ హీరోలు కలిసి చేస్తున్నవి వస్తున్నాయి. ఒకే స్టార్ డం ఒకే ఏజ్ గ్రూప్ లో ఉన్న హీరోలతో మల్టీస్టారర్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆ మల్టీస్టారర్ లో తమ హీరోకు ప్రాముఖ్య దక్కలేదంటే మా హీరోను తక్కువ చూపించారు అని అభిమానులు గొడవ చేసే అవకాశం ఉంది. అందుకే అలాంటి ప్రయత్నం ఎవరు చేసే సాహసం చేయడం లేదు. అయితే జక్కన్న ప్రస్తుతం 'ఆర్‌ఆర్‌ఆర్' తో ఆ సాహసం చేయబోతున్నాడు. ఎన్టీఆర్ తారక్ ల ఫ్యాన్స్ ను సంతృప్తి పర్చేందుకు తాను ముందే ప్లాన్ చేసుకున్నట్లుగా జక్కన్న తాజా ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చాడు.ఇద్దరు హీరోలు అనగానే ఈ హీరోకు ఒక ఫైట్ ఆ హీరోకు ఒక ఫైట్ - ఈ హీరోకు ఒక పాట ఆ హీరోకు ఒక పాట అన్నట్లుగా చేసుకుంటూ పోతే కథలో రసం  మిస్ అయిపోతుంది. కథ ప్రధాన ఉద్దేశ్యం దెబ్బ తింటుంది. అలా నేను చేయబోవడం లేదు. ఈ సినిమాలో ప్రేక్షకులు అంతా కూడా రామ్ చరణ్ - ఎన్టీఆర్ లను కాకుండా ఒక రామరాజు - కొమురం భీంను చూసేలా కథలో ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తాం. సినిమా ఆరంభం అయిన పది నిమిషాల్లోనే కథలో విలీనం అయ్యి పాత్రలతో ట్రావెల్ అయ్యేలా సినిమా ఉంటుందని జక్కన్న చెప్పుకొచ్చాడు.

ఈ చిత్రంలో ఎవరిని ఎక్కువ చూపించడం - ఎవరిని తక్కువ చూపించడం అంటూ ఏమీ ఉండదు. సినిమా మొత్తంలో కూడా అల్లూరి పాత్రలో రామ్ చరణ్ ఎంతైతే ప్రేక్షకులకు నచ్చుతాడో అంతే కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ కూడా అంతే నచ్చే విధంగా సినిమాలోని హీరోల పాత్రలు ఉంటాయని రాజమౌళి పేర్కొన్నాడు. హీరోల ఇమేజ్ కోసం ఫ్యాన్స్ ను మెప్పించడం కోసం కథను కంపు చేయనని రాజమౌళి డైరెక్ట్ గా చెప్పేశాడు. జులై 30 - 2020న విడుదల కాబోతున్న ఈ మూవీ ఎంత పెద్ద సంచలన విజయాన్ని నమోదు చేస్తుందో అని ఇప్పటి నుండే అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.