Begin typing your search above and press return to search.

'ఆర్ఆర్ఆర్'లో ఆ థ్రిల్లింగ్ సన్నివేశాలు కూడా ఉన్నాయట..!!

By:  Tupaki Desk   |   3 Aug 2020 5:11 PM GMT
ఆర్ఆర్ఆర్లో ఆ థ్రిల్లింగ్ సన్నివేశాలు కూడా ఉన్నాయట..!!
X
దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమా గురించి దేశమంతా ఎదురు చూస్తుంది. దేశమంతా ఒక విధంగా ఊహించుకుంటే.. సినిమా మీ ఊహలకు అందకుండా ఉంటుందని అంటున్నారు డైరెక్టర్ రాజమౌళి. స్వాతంత్ర్య సమరయోధుల కథ అనేసరికి అందరూ ఈ సినిమా దేశభక్తి గురించి ఉంటుందని భావించారు. కానీ అది నిజం కాదని స్వయంగా క్లారిటీ ఇచ్చారు చిత్రబృందం. ఈ సినిమాలో రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్' సినిమా దేశభక్తికి సంబంధించింది కాదని, కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య స్వచ్ఛమైన స్నేహం గురించి మాత్రమే సినిమా సాగుతుందని చెప్పుకొచ్చారు. ఈ మాటలు విన్న ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. అదేంటి స్నేహం గురించి తీసే సినిమాలో అల్లూరి, కొమరం భీమ్ లు ఎందుకని అడగగా.. చెప్పాను కదా ఇది కల్పిత కథ అంటూ జవాబిచ్చాడు రాజమౌళి.

ఈ కథ 1919-22 మధ్య ప్రాంతంలో ఒకేసారి ఇంట్లో నుండీ వెళ్లిపోయిన ఈ ఇద్దరు యోధులు.. ఆ మూడు నాలుగేళ్లు ఏం చేసారనేది మెయిన్ కథాంశం అంటూ చెప్పుకొచ్చాడు రాజమౌళి. ఇక ఈ చిత్రానికి 'రౌద్రం రణం రుథిరం' అనే టైటిల్ ఫైనల్ చేసారు. ఈ సినిమాను దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాంచరణ్ పుట్టినరోజు సందర్భంగా చిత్రయూనిట్ విడుదల చేసిన 'భీమ్ ఫర్ రామరాజు' వీడియోకి అద్బుతమైన ట్రెండ్ సృష్టించింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా ఫుల్ సస్పెన్స్ థ్రిల్లింగ్ గా ఉండబోతుందట. అలాగే సస్పెన్సు సన్నివేశాలు కూడా.. రాజమౌళి ఈ సినిమాను ఓ సీట్ ఎడ్జ్ మూవీగా రూపొందిస్తున్నాడట. ఇప్పటికే 70% షూటింగ్ కంప్లీట్ చేసుకుందట. ప్రస్తుతం ఈ సినిమా లాక్ డౌన్‌లోకి వెళ్లింది. అందుకే షూటింగు నిలిచిపోయింది. షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో ఎవరికీ తెలీదు. ఇంతలో వచ్చే సంవత్సరం జనవరి 8న ఆర్ఆర్ఆర్ ను విడుదల చేస్తామని రాజమౌళి టీమ్ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో మేకర్స్ కూడా చెప్పలేక పోతున్నారు.