Begin typing your search above and press return to search.

రాజ‌మౌళి - సుకుమార్ః ముందు శ‌త్రువులు.. ఇలా మిత్రుల‌య్యారు!

By:  Tupaki Desk   |   19 Jun 2021 2:30 AM GMT
రాజ‌మౌళి - సుకుమార్ః  ముందు శ‌త్రువులు.. ఇలా మిత్రుల‌య్యారు!
X
తెలుగు సినిమా స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసిన దర్శకుడు రాజమౌళి. అయితే.. ఆ స్థాయి పేరు రాలేదుగానీ.. క్రియేటివిటీలో మాత్రం మ‌హాతోపు సుకుమార్‌. ఆయ‌న క్రియేటివిటీ ఏంట‌న్న‌ది ఆర్య చూసిన‌వాళ్లకే తెలుస్తుంది. అప్ప‌టి వ‌ర‌కూ తెలుగు హీరో మూస ధోర‌ణిలో ప‌డి కొట్టుకు పోతుండ‌గా.. రివ‌ర్స్ లో ఎదురు తిప్పాడు సుకుమార్‌. సీన్ క‌ట్ చేస్తే.. అల్లు అర్జున్ ను స్టార్ ను చేసే సినిమా ఇచ్చాడు.

ఈ సినిమా త‌ర్వాత చాలా మంది ద‌ర్శ‌కులు సుకుమార్ ను చూసి.. 'వీడెవడ్రా' ఏదో తేడాగా క‌న‌ప‌డుతున్నాడు అని ఒకింత జెల‌సీ ఫీల‌య్యార‌ట‌. ఆ ద‌ర్శ‌కుల జాబితాలో ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి కూడా ఉన్నాడ‌ట‌! సుకుమార్ మేకింగ్ చూసి.. చాలా అసూయ ప‌డ్డార‌ట‌.

దీనికి కార‌ణం లేక‌పోలేదు. అప్ప‌టి వ‌ర‌కు ఇండ‌స్ట్రీలో తోపు డైరెక్ట‌ర్ గా నిరూపించుకోలేదు జ‌క్క‌న్న‌. అప్ప‌టికి కేవ‌లం రెండు సినిమాలు మాత్ర‌మే చేసి ఉన్నాడు. ఒకే హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబ‌ర్ 1, సింహాద్రి చిత్రాలు చేశాడు. అలాంటి స‌మ‌యంలో 'ఆర్య‌'తో దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడట సుకుమార్.

ఆ సినిమా చూసిన తర్వాత.. 'వీడెవడో మనకు పోటీ వచ్చేశాడు' అనుకున్నాడట రాజమౌళి. గతంలో ఈ విష‌యాన్ని ఓపెన్ గా చెప్పాడు జ‌క్క‌న్న‌. అయితే.. ఈ విష‌యం గురించి బాగానే ఆలోచించిన రాజ‌మౌళి.. త‌న‌కు తాను రెండు ప్ర‌శ్న‌లు వేసుకున్నార‌ట‌.

ఇత‌నితో శ‌త్రుత్వం పెంచుకోవాలా? మిత్రుడిగా చేసుకోవాలా? త‌న‌కు తాను ప్రశ్నించుకున్నార‌ట‌. శ‌త్రువుగా చూస్తే.. నిరంత‌రం కోప‌గించుకోవాలి. అదే.. స్నేహితునిగా చేసుకున్నామంటే.. మ‌న‌సును ప్ర‌శాంతంగా ఉంచుకోవ‌చ్చు అని అనుకున్నార‌ట‌. దీంతో.. దోస్తానాకు చేయి చాచార‌ట‌. ఆ విధంగా.. రాజ‌మౌళి-సుకుమార్ మంచి స్నేహితులుగా మారిపోయారు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు వీరి ఫ్రెండ్షిప్ కొన‌సాగుతూనే ఉంది.