Begin typing your search above and press return to search.

నాని బాబు.. లవ్ యు అంతే: రాజమౌళి

By:  Tupaki Desk   |   22 April 2019 7:02 AM GMT
నాని బాబు.. లవ్ యు అంతే: రాజమౌళి
X
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని - శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటించిన చిత్రం 'జెర్సీ'. ఏప్రిల్ 19 న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులనుంచే కాకుండా సెలబ్రిటీల నుంచి కూడా ప్రశంసలు అందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లాంటి స్టార్స్ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఈసినిమాకు SS రాజమౌళి రాజముద్ర కూడా పడింది.

ఈ సినిమాను చూసిన దర్శకధీరుడు తన ట్విట్టర్ ఖాతా ద్వారా "హృదయాన్ని తాకేలా ఉంది.. ఫన్ గా కూడా ఉంది. అద్బుతంగా స్క్రిప్ట్ రాసి.. ఎంతో నైపుణ్యంతో దర్శకత్వ ప్రతిభతో తెరకెక్కించిన సినిమా 'జెర్సీ'. గౌతమ్ తిన్ననూరి.. వెల్ డన్. ఈ సినిమాలో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ చిత్రం. నాని 'బాబు'.. జస్ట్ లవ్ యు అంతే.." అంటూ ట్వీట్ చేశారు. ఏకంగా రాజమౌళి నుంచి ఈరకమైన ప్రశంసలు అందుకోవడం అంటే మాటలు కాదుగా?

వివిధ కారణాల వల్ల ఈమధ్యకాలంలో మినీ రివ్యూలకు దూరంగా ఉంటున్న జక్కన్న హృదయాన్ని కదిలించిందంటేనే గౌతమ్ దర్శకత్వ ప్రతిభను మనం అర్థం చెసుకోవచ్చు. అయినా నాని 'బాబు' అని జక్కన్న నానిని ఎందుకు సంబోధించారో తెలుసా? నాని అసలు పేరు ఘంటా నవీన్ బాబు. అది సంగతి.