రాజమౌళి ముందున్న టార్గెట్ అదేనా?

Wed Jul 06 2022 05:00:02 GMT+0530 (India Standard Time)

Rajamouli Target Global Audience

బాహుబలి RRR లతో పాన్ ఇండియా ని టార్గెట్ ని సక్సెస్ ఫుల్ గా రీచ్ అయ్యాడు. ఇప్పడు మహేష్ మూవీతో ఆయన టార్గెట్ మారింది. రాజమౌళి టార్గెట్ గ్లోబల్ ఆడియన్స్. వివరాల్లోకి వెళితే.. స్టార్ హీరోస్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల తొలి కలయికలో రూపొందిన భారీ మల్టీస్టారర్ మూవీ 'RRR'. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా సంచలన విజయాన్ని సాధించింది. ఇటీవల నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ మూవీ అక్కడ కూడా దుమ్ముదులిపేస్తూ సంచలనం సృష్టిస్తోంది.ఈ సినిమాతో రాజమౌళి హాలీవుడ్ మేకర్స్ దృష్టిని ఆకర్షించడంలో సక్సెస్ అయ్యారు. నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ మూవీపై హాలీవుడ్ మేకర్స్ క్రిటిక్స్ రైటర్స్ స్టార్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కొంత మంది విమర్శలు కూడా చేస్తున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీ తో పాన్ ఇండియా వైడ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న రాజమౌళి త్వరలో మహేష్ తో చేయబోతున్న ప్రాజెక్ట్ తో గ్లోబల్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తున్నారట.

#SSMB29 గా తెరపైకి రానున్న ఈ మూవీకి సంబంధించిన బేసిక్ ప్లాట్ ని పాపులర్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ లాక్ చేశారని ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే యాక్షన్ అడ్వెంచర్ గా ఈ మూవీ వుండబోతోందంటూ గత కొన్ని రోజులుగా వరుస కథనాలు వినిపిస్తున్నాయి. బాహుబలి RRR లతో ఇంటర్నేషనల్ లెవెల్లో తన పేరు మారుమోగేలా చేసుకున్న రాజమౌళి మహేష్ ప్రాజెక్ట్ విషయంలో తన ప్లాన్ ని మార్చుకున్నారని సరికొత్తగా గ్లోబల్ ఆడియన్స్ కు రీచ్ అయ్యే విధంగా ఈ మూవీని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

ఆ స్థాయి స్క్రిప్ట్ ని సిద్ధం చేయమని రాజమౌళి తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కు వివరించారట. పలు కాన్సెప్ట్ లు చర్చకు వచ్చాయని అందులో ఓ కాన్సెప్ట్ ని లాక్ చేయబోతున్నారని చెబుతున్నారు. అయితే తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన విజయేంద్ర ప్రసాద్ #SSMB29 స్క్రిస్ట్ పై క్లారిటీ ఇచ్చారు. ఇంకా ఎలాంటి లైన్ ని అనుకోలేదని ఏ కథని లాక్ చేయలేదని స్పష్టం చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. మారిన రాజమౌలి ప్లాన్ ప్రకారం భారీ కథని సిద్ధం చేయాలన్న ఆలోచనలో భాగంగానే ఇంత వరకు ఏ లైన్ ని ఫైనల్ చేయలేదని విజయేంద్ర ప్రసాద్ చెప్పిన సమాధానంని బట్టి స్పష్టమవుతోంది.

ఇదిలా వుంటే #SSMB29 ప్రాజెక్ట్ కోసం రాజమౌళి ఇంటర్నేషన్ స్టూడియోలతో మంతనాలు జరుపుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. తన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా భారీ కాన్వాస్ పై #SSMB29 ని బిగ్ స్కేల్ లో తెరపైకి తీసుకురావాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట. ఇందు కోసం చాలా సమయం తీసుకోనున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు కూడా ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు రెండేళ్లకు మించి డేట్స్ కేటాయించబోతున్నారట. ఈ ఏడాది ఎండింగ్ లో ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించే అవకాశం వుందని వచ్చే ఏడాది ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని ఇన్ సైడ్ టాక్.