Begin typing your search above and press return to search.

RRR కోసం 20 కోట్ల బ‌డ్జెట్ తో సెట్?

By:  Tupaki Desk   |   3 Jun 2020 3:45 AM GMT
RRR కోసం 20 కోట్ల బ‌డ్జెట్ తో సెట్?
X
భారీ పాన్ ఇండియా సినిమాల్ని తెర‌కెక్కించ‌డంలో రాజ‌మౌళి ప‌నిత‌నం గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. మ‌గ‌ధీర‌- బాహుబ‌లి ఫ్రాంఛైజీ సినిమాల‌తో అత‌డు పాన్ ఇండియా డైరెక్ట‌ర్ గా సంచ‌ల‌నాలు సృష్టించాడు. ఇక వీ.ఎఫ్‌.ఎక్స్ ప‌రంగా ఈగ లాంటి క్లాసిక్ సినిమాని తెర‌కెక్కించిన ఘ‌న‌త ఆయ‌న సొంతం. మ‌గ‌ధీర‌.. బాహుబ‌లి 1 .. బాహుబ‌లి 2 చిత్రాల‌కు భారీగా వీ.ఎఫ్‌.ఎక్స్ షాట్స్ ని డిజైన్ చేయ‌డ‌మే గాక‌.. వీఎఫ్‌.ఎక్స్ ని స‌మ‌ర్థంగా ఉప‌యోగించ‌డం లో స‌క్సెసయ్యారు.

ప్ర‌స్తుతం ఆర్.ఆర్.ఆర్ రూపంలో మ‌రోసారి అలాంటి ప్ర‌య‌త్న‌మే చేస్తున్నారు. ఇద్ద‌రు స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల చ‌రిత్ర‌ను ఫిక్ష‌న‌ల్ గా చూపించే ప్ర‌య‌త్నం చేస్తుండ‌డంతో విజువ‌ల్ గ్రాఫిక్స్ కి స్కోప్ అమాంతం పెరిగింది. ఈ సినిమాలో గిరిజ‌న విప్ల‌వ‌కారుడు కొమురం భీమ్ పులితో పోరాటం.. అలానే అల్లూరి సీతారామ‌రాజు విల్లంబుల పోరాటం.. ఆంగ్లేయుల‌పై తిరుగుబాటు .. గెరిల్లా యుద్ధం.. వీట‌న్నిటికీ విజువ‌ల్ ఎఫెక్ట్స్ ప‌ని చాలా ఇంపార్టెంట్.

ఇక వీ.ఎఫ్.ఎక్స్ లోనే తెల్లోళ్లు పాలించిన కోటల‌ ప్రాకారాల్ని తీర్చిదిద్దాల్సి ఉంటుంది. అయితే వీట‌న్నిటినీ ఎస్.ఎస్.రాజ‌మౌళి ఎక్కడ సెట్ చేశారు? అంటే.. అందుకోసం హైద‌రాబాద్ గండికోట విలేజ్ ప‌రిస‌రాల్లో భారీ సెట్లు వేసి ప్రాకారాల్ని తీర్చిదిద్దారు‌. కేవ‌లం ఆర్.ఆర్.ఆర్ కోసం గండిపేట లో రూ .18 కోట్ల విలువైన సెట్ ఇంత‌కు ముందే వేశారు. ఇక్క‌డే మెజారిటీ షూట్ జ‌రిగింది. అనూహ్యంగా లాక్ డౌన్ వ‌ల్ల నెల‌రోజుల షూటింగ్ పెండింగ్ లో ప‌డిపోయింది. ఇప్పుడు దానిని పూర్తి చేసేందుకు రాజ‌మౌళి ఏర్పాట్లు చేసుకున్నారు. 30శాతం పెండింగ్ షూటింగ్ ఉంద‌ని ఇంత‌కు ముందే చెప్పారు కాబ‌ట్టి దానిని పూర్తి చేసేందుకు రాజ‌మౌళి స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ అల్లూరి పాత్ర‌లో న‌టిస్తుండ‌గా.. ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. డివివి ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప‌తాకంపై డివివి దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.