Begin typing your search above and press return to search.

హాలీవుడ్ సంస్థలతో రాజమౌళి.. మహేష్ కోసం భారీ ప్లాన్..!

By:  Tupaki Desk   |   7 Dec 2022 2:30 AM GMT
హాలీవుడ్ సంస్థలతో రాజమౌళి.. మహేష్ కోసం భారీ ప్లాన్..!
X
RRR తో మరోసారి వరల్డ్ వైడ్ గా తన టాలెంట్ ఏంటో చూపించిన రాజమౌళి తన నెక్స్ట్ సినిమా మహేష్ బాబుతో చేసే సినిమాకు భారీ డీల్స్ పొందుతున్నారు. ఆర్.ఆర్.ఆర్ సినిమా టైం లో బాహుబలిని మించి సినిమా తీయడం రాజమౌళి వల్ల కాదని అన్నారు. కానీ ట్రిపుల్ ఆర్ తో వరల్డ్ వైడ్ గా తన డైరక్షన్ సత్తా చూపించాడు జక్కన్న. థియేట్రికల్ రిలీజ్ కన్నా ఆర్.ఆర్.ఆర్ నెట్ ఫ్లిక్స్ ఓటీటీ రిలీజ్ తర్వాత హాలీవుడ్ మేకర్స్ సైతం వారెవా అనేలా చేశాడు.

ఈ క్రమంలోనే ఆర్.ఆర్.ఆర్ తో రాజమౌళికి ఆస్కార్ కూడా వస్తుందన్న టాక్ కూడా నడుస్తుంది. ఇదిలాఉంటే రాజమౌళి మహేష్ తో చేస్తున్న సినిమాకు నిర్మాతగా కె.ఎల్ నారాయణ వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సినిమా పాన్ వరల్డ్ సినిమాగా ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి.

అందుకే కె.ఎల్ నారాయణతో పాటుగా హాలీవుడ్ మేకర్స్ ని ఈ ప్రాజెక్ట్ లో తీసుకుంటున్నారట. రాజమౌళితో సినిమా కోసం పలు హాలీవుడ్ నిర్మాణ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఆల్రెడీ మహేష్ మూవీ నారాయణతో కమిట్మెంట్ ఉంది కాబట్టి ఈ సినిమాకే మరికొంతమందిని నిర్మాణ భాగస్వామ్యం చేస్తున్నారట రాజమౌళి.

కె.ఎల్ నారాయణ కేవలం తెలుగు మార్కెట్ వరకు చూసుకున్నా పాన్ వరల్డ్ మార్కెట్, ప్రమోషన్స్ ఇంకా రిలీజ్ లాంటి విషయాలు సదరు హాలీవుడ్ ప్రొడక్షన్ ప్లాన్ చేస్తుందట.

దీనికోసం రాజమౌళికి భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నట్టు తెలుస్తుంది. సో మహేష్ తో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు అనుకున్న రాజమౌళి అది పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ మూవీ అని మరోసారి గుర్తు చేస్తున్నారు. ఇదో విధంగా టాలీవుడ్ మార్కెట్ కి బిగ్ బొనాంజా అని చెప్పొచ్చు.

మహేష్ కూడా కరెక్ట్ సినిమాతో పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వాలని అనుకోగా ఇప్పుడు రాజమౌళి సినిమాతో పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ఫిక్స్ చేసుకున్నాడు. ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ ఈ మూవీ కథ మీద కూర్చోగా.. 2023 మార్చి, ఏప్రిల్ నుంచి ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్తుందని అంటున్నారు. రాజమౌళి సినిమా కాబట్టి ఎలా లేదన్నా రెండేళ్లు పడుతుంది. సో 2024 చివర్లో కానీ 2025 మొదట్లో కానీ మహేష్, రాజమౌళి సినిమా రిలీజ్ ఉంటుందని చెప్పొచ్చు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.