ఆ హీరో అందుకు ఒప్పుకుంటాడా..?

Sat Mar 28 2020 21:00:01 GMT+0530 (IST)

Rajamouli Planning Role for Vijay In #RRR

ఇళయదళపతి విజయ్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత తమిళనాడులో అంతటి మార్కెట్ ను కలిగి ఉన్నాడు. రజినీకాంత్ తర్వాత ఆ లెవెల్ లో పారితోషికం అందుకుంటున్నాడు అని అందరికి తెలిసిందే. రీసెంట్ గా బిగిల్ సినిమాతో హిట్ అందుకున్న విజయ్ తదుపరి మాస్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే తాజాగా విజయ్ గురించి సోషల్ మీడియాలో ఒక వార్త హల్ చల్ చేస్తుంది.  ఆర్ ఆర్ ఆర్ సినిమాను రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇందులో హీరోలుగా ఎన్టీఆర్ - రాంచరణ్ లను తీసుకున్నాడు. వీరిద్దరూ కూడా పాన్ ఇండియా స్టార్లు కాకపోవడంతో హిందీలో మార్కెట్ కోసం ఈ సినిమాలో అజయ్ దేవగన్ - అలియా భట్ లను తీసుకున్నాడు.బాలీవుడ్ లో వీరిద్దరితో మార్కెట్ పెరిగే అవకాశం ఉంది. ఇక రాంచరణ్ - ఎన్టీఆర్ లకు మలయాళంలో కాస్త పరిచయం ఉంది. కానీ తమిళంలో నుండి ఈ సినిమాలో ఏ స్టార్ లేకపోయేసరికి రాజమౌళి విజయ్ కి చిన్న పాత్రను క్రియేట్ చేసే ప్లాన్ వేయనున్నట్లు సమాచారం. ఈ విధంగా అయినా విజయ్ ఉంటే కోలీవుడ్ - మల్లువుడ్ లో మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారట. అందుకే ఆర్ ఆర్ ఆర్ టీం విజయ్ ని సినిమాలో చూపించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారట. మరి   విజయ్ ఈ ఛాన్స్ స్వీకరిస్తాడా..? అంటే రాజమౌళి అడిగితే ఖచ్చితంగా స్వీకరిస్తాడని సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. చూడాలి మరి ఎలాంటి సమాచారం అందుతుందో..