Begin typing your search above and press return to search.

RRR క్లైమాక్స్ అక్కడ సెట్ చేసిన జక్కన్న

By:  Tupaki Desk   |   10 Dec 2019 12:09 PM GMT
RRR క్లైమాక్స్ అక్కడ సెట్ చేసిన జక్కన్న
X
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం 'RRR' షూటింగ్ తో బిజీగా ఉన్నారు. రామ్ చరణ్.. ఎన్టీఆర్ లు ఈ సినిమా కోసం పూర్తి సమయం కేటాయిస్తుండడంతో షూటింగ్ చకచకా జరుగుతోందని ముందుగా ప్రకటించిన సమయానికే సినిమా విడుదల అవుతుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ పోర్షన్ చిత్రీకరణ సాగుతోందట.

విశాఖ మన్యం ప్రాంతంలోలిం డల్లాపల్లి.. మోదాపల్లి మండలాల్లోని కాఫీ తోటలలో ఈ క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరణ జరుపుతున్నారట. ఆరు రోజుల పాటు ఈ ప్రదేశాల్లో చిత్రీకరణ కొనసాగుతుందని అంటున్నారు. బ్రిటిష్ వారితో కథానాయకులు పోరాడే సన్నివేశాలు ప్రేక్షకులను థ్రిల్ చేసేలా ఉంటాయట. అయితే ఈ షూటింగ్ కు సంబంధించిన ఫోటోలు.. వీడియోలు బయటకు రాకుండా జక్కన్న టీమ్ జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం.

ఈ సినిమాలో అలియా భట్.. ఒలివియా మోరిస్.. అజయ్ దేవగణ్.. రాహుల్ రామకృష్ణ.. సముద్రకని ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నిర్మాత డివివి దానయ్య ఈ సినిమాను రూ. 350 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 'బాహుబలి' ఫ్రాంచైజీ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో దేశవ్యాప్తంగా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.