Begin typing your search above and press return to search.

తనపై నమోదైన కేసుకు సమాధానం చెప్పని జక్కన్న

By:  Tupaki Desk   |   24 Feb 2020 4:14 AM GMT
తనపై నమోదైన కేసుకు సమాధానం చెప్పని జక్కన్న
X
విశ్వక్‌ సేన్‌ హీరోగా నాని నిర్మాణంలో రాబోతున్న ‘హిట్‌’ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక తాజాగా జరిగింది. ఈ సినిమా మొత్తం కూడా ఒక కేసు ఇన్వెస్టిగేషన్‌ నేపథ్యంలో సాగుతూ ఉంటుంది. సినిమా థీమ్‌ ను అనుసరించి ప్రీ రిలీజ్‌ వేడుకను కూడా ప్లాన్‌ చేశారు. ఈ కార్యక్రమానికి హోస్టింగ్‌ చేసిన సుమ తనదైన శైలిలో నవ్వులు పూయిస్తూ కార్యక్రమాన్ని సరదాగా ముందుకు నడిపింది. స్టేజ్‌ పైకి వచ్చే ఒక్కో గెస్ట్‌ పై ఒక్కో కేసును బనాయించి ఫిర్యాదు నమోదు అయ్యిందని చెప్పి ఎంక్వౌరీ చేయడం నవ్వులు పూయించింది.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు అయిన రాజమౌళిని కూడా సుమ ఎంక్వౌరీ చేసింది. మీ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు పని చేస్తున్న అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌.. కో డైరెక్టర్స్‌ కనిపించడం లేదు అంటూ వారి భార్యలు వచ్చి కేసు పెట్టారు. వారిని మీరు ఎప్పుడు వదలబోతున్నారు అంటూ సుమ ప్రశ్నించింది. జనవరి 8న సినిమాను విడుదల చేయబోతున్నాం. అప్పుడే వారికి కూడా విడుదల అంటూ జక్కన్న ఫన్నీగా సమాధానం ఇచ్చాడు.

ఇక మీపై మరో అభియోగం నమోదు అయ్యింది. మీరు చేస్తున్న వరుస సినిమాలు సక్సెస్‌ అవుతున్నాయి. ఆ సక్సెస్‌ కు కారణం ఏంటో తెలుసుకునేందుకు కేసు నమోదు అయ్యిందని సుమ ప్రశ్నించగా జక్కన్న ఫన్నీగా స్పందిస్తూ మీరు ఇలాంటి ప్రశ్నలు వేయకూడదు.. అసలు ఇలాంటివి ఎఫ్‌ ఐ ఆర్‌ లో నమోదు చేయకూడదు. బైలాన్‌ లో ఇలాంటివి ఉండకూడదు అంటూ సమాధానం చెప్పకుండా మెల్లగా జారుకున్నాడు.