నెల ముందే ప్లాన్ చేస్తున్న జక్కన్న

Wed Nov 24 2021 14:13:57 GMT+0530 (IST)

Rajamouli Intense efforts to Massive release RRR

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా ను భారీ ఎత్తున విడుదల చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. సినిమాకున్న బజ్ ను మరింత పెంచేందుకు గాను ప్రమోషన్స్ ను డిసెంబర్ మొదటి వారం నుండి షురూ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే హీరోలు ఇద్దరి పోస్టర్ లు.. గ్లిమ్స్.. పాటలు వచ్చాయి. మరో పాట కూడా విడుదలకు సిద్దంగా ఉంది.ఆర్ ఆర్ ఆర్ ను ఇంకా ఎలా ప్రమోట్ చేస్తారు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో జక్కన్న చాలా అడ్వాన్స్ గా ట్రైలర్ ను విడుదల చేసేందుకు సిద్దం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సాదారణంగా అయితే సినిమా విడుదలకు వారం లేదా పది రోజుల ముందే మహా అయితే రెండు వారాల ముందు ట్రైలర్ ను విడుదల చేస్తారు. కాని జక్కన్న మాత్రం నెల రోజుల ముందుగానే ట్రైలర్ ను విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

డిసెంబర్ మొదటి వారంలో ట్రైలర్ విడుదల తో సినిమా ప్రమోషన్ ను మొదలు పెట్టబోతున్నారట. దేశ విదేశాల్లో భారీ ఎత్తున ఈ సినిమాను విడుదల చేయబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కోసం చిత్ర యూనిట్ సభ్యులు చాలా టూర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ముంబయి తో పాటు దేశం లో పలు ముఖ్య నగరాలను కవర్ చేస్తూ ఆర్ ఆర్ ఆర్ టీమ్ ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశాల్లో కూడా సినిమా యూనిట్ సభ్యులు ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ట్రైలర్ విడుదల తర్వాత సినిమా ప్రమోషన్ గురించి మరింత స్పష్టత ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

బాహుబలి సినిమా తర్వాత జక్కన్న నుండి రాబోతున్న సినిమా అవ్వడం వల్ల అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. నాలుగు ఏళ్ల క్రితం ఈ సినిమా ఓకే అయ్యింది.. దాదాపుగా మూడు ఏళ్ల క్రితం సినిమా చిత్రీకరణ ప్రారంభం అయ్యింది. మద్యలో ఒక ఏడాది మొత్తం కరోనా వల్ల షూటింగ్ జరగలేదు.

గత ఏడాదిలోనే ఈ సినిమా విడుదల చేయాలనుకున్న సాధ్యం కాలేదు.. ఈ ఏడాది జనవరిలో సంక్రాంతికి వస్తుందని భావించిన ఈ సినిమా కాస్త వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు గా ఎన్టీఆర్ కొమురం భీమ్ లు గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్ మరియు అజయ్ దేవగన్ లు నటించారు.