Begin typing your search above and press return to search.

జ‌క్క‌న్నలా ర‌విబాబు కూడా...?!

By:  Tupaki Desk   |   3 Dec 2015 7:08 AM GMT
జ‌క్క‌న్నలా ర‌విబాబు కూడా...?!
X
ఈగ చుట్టూ క‌థ‌ని న‌డిపి స‌క్సెస్ కొట్టిన జ‌క్క‌న్న‌ని ర‌విబాబు స్ఫూర్తిగా తీసుకున్న‌ట్టున్నాడు. జ‌క్క‌న్న ఈగ‌తో సినిమా చేస్తే ర‌విబాబు మాత్రం ఓ జంతువుతో సినిమా చేయ‌బోతున్నాడు. ఈగ కోసం రాజ‌మౌళి ఏ స్థాయిలో గ్రాఫిక్స్‌ ని వాడుకొన్నాడో అలాగే ర‌విబాబు కూడా గ్రాఫిక్స్‌ కి పెద్ద‌పీట వేస్తూ సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌. అందుకు సంబంధించి ప‌నులు శ‌ర‌వేగంగా సాగుతున్న‌ట్టు స‌మాచారం. ఈగ‌కి కావ‌ల్సినంత‌గా టెక్నిక‌ల్ స‌పోర్ట్‌ ని ఇచ్చింది సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌. డి.సురేష్‌ బాబు ఆ సినిమాకి ఓ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించాడు. ఇప్పుడు రవిబాబు జంతువు ఆధారంగా తీసే సినిమాకి కూడా సురేష్‌ బాబే నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి ర‌విబాబు ఏ జంతువు ఆధారంగా సినిమా తీస్తాడ‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

మంచి సృజ‌నాత్మ‌క ఆలోచ‌న‌లున్న ద‌ర్శ‌కుడిగా ర‌విబాబుకి పేరుంది. చిన్న బ‌డ్జెట్‌ తో సినిమాలు చేస్తూ మంచి స‌క్సెస్‌ లు సాధించిన రికార్డు ఆయ‌న‌కుంది. అయితే కొంత‌కాలంగా ర‌విబాబుకి వ‌ర‌స ప‌రాజ‌యాలు ఎదుర‌వుతున్నాయి. ల‌డ్డూబాబు - అవును 2 చిత్రాలు ప‌రాజ‌యాన్ని చ‌విచూశాయి. అవును 2కి పెట్టిన డ‌బ్బైనా తిరిగొచ్చింది కానీ... ల‌డ్డూబాబు మాత్రం నిర్మాత‌ని నిండా ముంచేసింది. మ‌రి ప్ర‌యోగాత్మ‌కంగా చేయబోతున్న కొత్త సినిమా ఎలాంటి ఫ‌లితాన్నిస్తుందో చూడాలి.