లిరికల్ సాంగ్: రాజ రాజ చోరుడు వచ్చేశాడు..!

Thu Jul 29 2021 16:02:16 GMT+0530 (IST)

Raja Raja Chora Lyrical Song Out

వర్సటైల్ యాక్టర్ శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''రాజ రాజ చోర''. హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మేఘా ఆకాశ్ - సునయన హీరోయిన్లుగా నటిస్తున్నారు. టైటిల్ తోనే ఆసక్తిని కలిగించిన ఈ సినిమాపై బజ్ క్రియేట్ అయ్యేలా మేకర్స్ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు.. ఇటీవల వచ్చిన టీజర్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా 'రాజ రాజు వచ్చే' అనే సాంగ్ లిరికల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.'దొరలని మీకు మీరు.. దొరులుతూ తిరిగారు.. చొరబడి చెడిపోతే.. చతికల పడతారు.. దొంగగారు.. ఓ రాజు గారు..' అంటూ వచ్చిన ఈ సాంగ్ చమత్కారంగా ఉంది. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ ఫ్రెష్ ట్యూన్ అందించారు. ఈ పాట ద్వారా హీరో చోర కళ గురించి తెలిసేలా హసిత్ గోలి సాహిత్యం రాశారు. సింగర్ మోహన భోగరాజు తనదైన శైలిలో ఈ 'రాజ రాజు వచ్చే' సాంగ్ ను ఆలపించారు. వేదరామన్ సినిమాటోగ్రఫీ అందించగా.. విప్లవ్ నిషాదం ఎడిటింగ్ వర్క్ చేశారు.

'రాజ రాజ చోర' చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందిస్తున్నారు. నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్ - అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. తనికెళ్ళ భరణి - ర్రవిబాబు - కాదంబరి కిరణ్ - శ్రీకాంత్ అయ్యంగార్ - అజయ్ ఘోష్ - వాసు ఇంటూరి - గంగవ్వ తదితరులు ఈ చిత్రంలో ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.