Begin typing your search above and press return to search.

రాజ రాజు చివ‌రికి అది కూడా చోరీ చేస్తాడా?

By:  Tupaki Desk   |   25 July 2021 7:30 AM GMT
రాజ రాజు చివ‌రికి అది కూడా చోరీ చేస్తాడా?
X
బ్రోచేవారెవ‌రురా? లాంటి విల‌క్ష‌ణ సినిమాతో ఆక‌ట్టుకున్న శ్రీ‌విష్ణు తాజా గా `రాజ రాజ చోర` చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో పౌరాణిక‌ గెట‌ప్పు తోనే శ్రీ‌విష్ణు ఆక‌ట్టుకుంటున్నాడు. అత‌డి నుంచి మ‌రో కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ ని తెలుగు ఆడియెన్ ఆశిస్తున్న క్ర‌మంలో తాజా చిత్రం వేడి పెంచుతోంది.

ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ- అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హసిత్ గోలి దర్శకత్వం వ‌హిస్తున్నారు. ఇందులో సునయన నాయికగా న‌టిస్తోంది. హీరో శ్రీవిష్ణు పుట్టినరోజు సంద‌ర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయ‌గా వైర‌ల్ అయ్యింది.

చోర విద్య‌లో ఆరితేరిపోయిన రాజ రాజ చోరు.. చోర క‌ళ‌తో రక్తి క‌ట్టిస్తాడ‌ని అర్థ‌మైంది.

తాజాగా `రాజ రాజు వ‌చ్చే.. ది చోర` సాంగ్ జూలై 28న‌ వ‌స్తోంది..!! అంటూ ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. గంగ‌వ్వ‌తో శ్రీ‌విష్ణు ఫ‌న్ ఆక‌ట్టుకుంటోంది. ఇక సాంగ్ ని కూడా చోరీ చేశాన‌ని చెబుతున్న శ్రీ‌విష్ణు తీరు న‌వ్వు పుట్టిస్తోంది. పాట‌ను దొంగ‌త‌నం చేస్తావా.. ఏం బుద్ధిరా నీది? అంటూ గంగ‌వ్వ నిల‌దీస్తోంది. అన్న‌ట్టు సాంగ్ ని దొంగిలించాడు..! అది ఈజీనే కానీ.. ఈ క‌రోనా క‌ష్ట కాలంలో రిలీజ్ డేట్ ని ప్ర‌క‌టించ‌డం.. థియేట‌ర్ల‌ను తెరిపించ‌డంలో అనే క‌ళ‌లో కూడా అత‌డు రాణిస్తే బావుంటుందేమో!